విద్యారంగంలో జగన్ మార్క్ సంచలనం

చదువుకుంటే సమాజం బాగుంటుంది అన్న నీతులు అందరూ చెబుతారు కానీ విద్యారంగానికి కేటాయించే నిధులు మాత్రం ఎపుడూ అరకొరగానే ఉంటాయి.  

అన్ని రంగాలకు అతిగా ఖర్చు చేసే ప్రభుత్వ పెద్దలు  విద్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం మహా పిసినారులు అయిపోతారు.

కానీ విద్యతో మాననవనరులు అభివృద్ధి  చెందుతాయి. ఆ సంపద సమాజానికి మరింత సౌభాగ్యాన్ని తెస్తుందన్న దానిని మరచిపోవడమే విడ్డూరం. 

ఇదిలా ఉంటే దేశంలో విద్యారంగంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వంగా జగన్ కొత్త రికార్డులు సృష్టిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పడం విశేషం.

దేశంలో ఇప్పటిదాకా కేరళలో 90.9 శాతం అక్షరాస్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 22వ స్థానంలో ఉండడం బాధాకరమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. 

ఇక జగన్ సర్కార్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని ధర్మాన ప్రశంసించారు. 

గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మ ఒడి లబ్దిదారులు మరింత పెరగడం జగన్ లక్ష్య శుద్ధికి అద్దం పడుతోందని ధర్మాన  అన్నారు. మొత్తానికి   విద్యాభివృద్ధికి జగన్ చేపడుతున్న చర్యలను మేధావులు సైతం కొనియాడుతున్నారు.

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా? 

Show comments