మిడిల్ ఏజ్డ్ పాత్రలపై పవన్ ఇంట్రెస్ట్

అటు రాజకీయాలు, ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. సినిమాల్లో నటిస్తోంటే ఏ ఏజ్‌లో అయినా ఫిట్‌గా వుండాలి. కానీ రాజకీయ వ్యవహారాల్లోను తలమునకవ్వాలంటే అంత టైమ్ వుండదు. కానీ నటుడిగా తనకున్న క్రేజ్ వృధా చేసుకోవడం పవన్‌కి ఇష్టం లేదు.

సినిమాకి యాభై కోట్ల వరకు నిర్మాతలు ఆఫర్ చేస్తోంటే అవి వదులుకోవడం ఇష్టం లేక పవన్ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నాడు. అందుకే ఫిట్‌నెస్ అవసరం లేని పాత్రలను పవన్ ఎంచుకుంటున్నాడు. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్స్ చేయడానికి పవన్ మొగ్గు చూపుతోంది అందుకేనట.

పింక్ రీమేక్‌లో పవన్ మిడిల్ ఏజ్డ్ లాయర్‌గానే కనిపిస్తాడు. పాత్రకు అనుగుణంగా ఎలా కనిపించినా ఫర్వాలేదు కనుక నటించాలని డిసైడ్ కాగానే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ మొదలు పెట్టేసాడు. 

అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌లో కూడా పవన్ చేయాలనుకుంటోన్న క్యారెక్టర్ ఏజ్ ఫిఫ్టీ ప్లస్ కావడంతో దానికీ ఫిట్‌నెస్ గొడవ లేదు. గ్లామరస్ లుక్ కానీ, ఫిట్‌నెస్ కానీ అవసరమనుకునే పాత్రలకు పవన్ ప్రస్తుతానికి దూరంగా వుంటున్నాడు.

జగన్ చేస్తున్నది అర్ధం కావాలంటే

Show comments