పవన్ పింక్ కూ థమన్

ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఫుల్ ఫామ్ లో వున్నారు.  మంచి మంచి ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. త్వరలో ఆయన కు మరో మంచి అవకాశం రాబోతోందని తెలుస్తోంది. పవర్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించకపోయినా, పింక్ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్మాత దిల్ రాజు ఆఫీసులో జరుగుతున్నాయి. ఎవరెవర్ని టెక్నికల్ కాస్ట్ గా తీసుకోవాలనే దానిపై చర్చలు సాగుతున్నట్లు బోగట్టా.

మామూలుగా అయితే దిల్ రాజు-దర్శకుడు వేణు శ్రీరామ్ కలిసి డిసైడ్ చేసేస్తారు. కానీ ఇక్కడ వున్నది పవన్ కళ్యాణ్. అందుకే ప్రతీదీ మూడు ఆప్షన్స్ తో లిస్ట్ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. అలా తయారుచేసిన లిస్ట్ ను పవన్ కళ్యాణ్ చూసి ఓ పేరు టిక్ చేస్తారన్నమాట.

సంగీత దర్శకుల్లో ముందుగా థమన్ పేరే వుందని తెలుస్తోంది. ఈ మధ్యన థమన్ రెండు సినిమాలు త్రివిక్రమ్ తో చేసారు. త్రివిక్రమ్ మాటంటే పవన్ కాదు అనరు. ఆ విధంగా థమన్ నే ఫైనల్ లిస్ట్ లోకి వచ్చేసినట్లే అని టాక్ వినిపిస్తోంది. 

Show comments