పవన్ మిత్రుడి శత్రువు 'గంటా'?

గంటా శ్రీనివాసరావును అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని దాదాపు శపథం చేసినంత పనిచేసారు పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఎందుకు గంటాపై పవన్ కు అంతకోపం? కేవలం అవినీతిపరుడు అనే ఆలోచనతోనేనా? మరేదైనా వుందా? అవినీతి విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీలో గంటా కన్నా ఎక్కువ ఆర్జించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అనేకమంది వున్నారు. కానీ వారి మీద పవన్ కు అంత కోపంలేదు.

పవన్ ఎక్కువ కోపం చూపించేవారు కొంతమంది వున్నారు. వారందరికీ ప్రజారాజ్యంతోనో, చిరంజీవితోనో ఇంతోఅంతో కనెక్షన్ వుండడం విశేషం. తన అన్నను తప్పుదారి పట్టించారనో? లేదా తన అన్న వైఫల్యం వెనుక వీరు వున్నారనో కోపమేనా? మరేదైనా వుందా?

నిజానికి గంటా ఉత్తరాంధ్ర తెలుగుదేశంలో కాపు సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా వున్నారు. అది వాస్తవం. అదే సమయంలో ఆయన భార్య వైపు బంధాలతో కమ్మ సామాజిక వర్గానికి కాస్త దగ్గరగానే వున్నారు. కానీ తెలుగుదేశం యువరాజు, చినబాబు లోకేష్ నాయుడుతో ఆయనకు అంతగా పొసగడం లేదని చిరకాలంగా వార్తలు వున్నాయి. ఈ కారణంగానే గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి కదిపేసి, ఆయనకు అంతగా సరిపోని విశాఖ నార్త్ సీటును కేటాయించారని రాజకీయ వర్గాల బోగట్టా.

అది కూడా చివరి నిమిషం వరకు ఇవ్వలేదు. పైగా లోక్ సభకు పంపాలని దేశం అధిష్టానం చాలా ప్రయత్నించింది. కానీ గంటా పట్టిన పట్టువదలకుండా ప్రయత్నించి, ఆఖరికి అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నారు. అప్పటికి అయితే చినబాబుతో కలిసి నవ్వుతూ ఫొటోకి ఫోజ్ ఇచ్చారు. కానీ లోలోపల తేడాలు అలాగే వున్నాయని రాజకీయ వర్గాల టాక్.

పైగా విశాఖలో చిరకాలంగా గెలుస్తూ వస్తున్న వెలగపూడికి మంత్రిపదవి యోగం పట్టడం లేదు. దీనికి కారణం గంటా అడ్డంగా వుండడమే అని టాక్ వుంది. దానివల్ల కూడా విశాఖలోని ఓ సామాజిక వర్గం గంటా అంటే పెద్దగా మొగ్గుచూపడం లేదు. ఈ ఈక్వేషన్లు అన్నీకలిసి పవన్ నోటివెంట పదే పదే గంటా వ్యతిరేక వ్యాఖ్యలు పలికిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

శతృవు శతృవు మిత్రుడు అన్న నానుడి వుంది. అలాగే మిత్రుడి శతృవు శతృవే అవుతాడేమో? పవన్ బాబుకి?

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

సీక్రెట్ గా లెటర్ రాస్తే.. ఆంధ్రజ్యోతికి ఎలా వచ్చింది.. పోసాని

 

Show comments