పవన్ కళ్యాణ్ వస్తున్నారహో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి ఇల్లు, ఫార్మ్ హవుస్ వదిలి కదలి వస్తున్నారు. వకీల్ సాబ్ షూటింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూలుకు తాను వస్తానని పవన్ చెప్పిన మీదటే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

వకీల్ సాబ్ సినిమాకు ఇంకా కనీసం  ముఫై రోజులు పవన్ కళ్యాణ్ పని చేయాల్సి వుంది. ఆయన ఇప్పటి నుంచి కంటిన్యూగా పని చేస్తే కనుక వకీల్ సాబ్ చకచకా రెడీ అయిపోతుంది.

సంక్రాంతికి పరిస్థితులను బట్టి విడుదల చేసుకోవచ్చు. ఈ సినిమా తరువాత అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ వుంటుంది. అలాగే క్రిష్ సినిమా కూడా చేయాల్సి వుంది. ఈ రెండింటి తరువాతే హరీష్ శంకర్ సినిమా. 

కరోనా ప్రభావం ప్రారంభమైన నాటి నుంచీ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయారు. ట్విట్టర్ లో ప్రకటనలు పోస్ట్ చేయ డం తప్ప ఆంధ్రలోకి వెళ్లలేదు. కరోనా వచ్చినా, వరదలు వచ్చినా, జనం బాధలకు ట్విట్టర్ లో స్పందించారు తప్ప బయటకు రాలేదు. ఇప్పుడు కరోనా భయం కాస్త తగ్గింది కనుక, షూటింగ్ కోసం బయటకు వస్తున్నారు. 

ఇండస్ట్రీలో 123 చిరంజీవే

Show comments