పవన్‌ని తెరమీదకు తెచ్చేందుకు త్రివిక్రమ్‌ ప్రయత్నం?

పవన్‌కళ్యాణ్‌ మళ్లీ నటిస్తాడా? పలుమార్లు ఇక నటించేది లేదు అంటూ పవన్‌ ఉద్ఘాటించినా కానీ పవన్‌ ఫలానా సినిమా చేయబోతున్నాడనే వార్తలయితే వస్తూనే వున్నాయి. ఇటీవల బాగా వినిపిస్తోన్నది మాత్రం 'పింక్‌' తెలుగు రీమేక్‌ పవన్‌ కళ్యాణ్‌ చేస్తాడని. తమిళంలో అజిత్‌తో రీమేక్‌ అయిన పింక్‌ అక్కడ బాగా ఆడడంతో దిల్‌ రాజు హక్కులు తీసుకున్నాడు. మొదట్లో బాలయ్యతో రీమేక్‌ చేస్తాడని చెప్పారు కానీ సడన్‌గా పవన్‌ పేరుని తెర మీదకు తెచ్చారు.

పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా చేయించడానికి త్రివిక్రమ్‌ బాగా కృషి చేస్తున్నాడని రూమర్స్‌ వున్నాయి. పవన్‌కి ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్‌ ఇటీవలే పవన్‌ని కలిసి పింక్‌ రీమేక్‌ గురించి చాలాసేపు చర్చించాడట. అయితే ఇందులో త్రివిక్రమ్‌కి వచ్చే లాభమేంటి అంటే, ఒకవేళ త్రివిక్రమ్‌ కనుక పవన్‌ని ఒప్పించగలిగితే దిల్‌ రాజుతో కలిసి సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం చేస్తాడట.

పవన్‌ కళ్యాణ్‌ అయితే ఇంకా తన నిర్ణయం తెలుపలేదని, కానీ తప్పకుండా పవన్‌ ఈ చిత్రం చేస్తాడనే నమ్మకాన్ని దిల్‌ రాజు తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. పవన్‌ ఈ చిత్రం చేస్తున్నాడంటే వచ్చే పబ్లిక్‌ రియాక్షన్‌ ఎలా వుంటుందోనని తెలుసుకోవడానికి కావాలనే మీడియాకి ఫీలర్లు వదిలారని కూడా వినిపిస్తోంది. పవన్‌ పునరాగమనంపై అభిమానుల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?

Show comments