పడిపోయాడన్న ప్రతిసారీ లేచాడు

కేసిఆర్ ఉద్యమ వ్యవహారాలు చూసుకోండి..రాజకీయ వ్యవహారాలు చూసుకోండి. పడిపోయాడు. పనైపోయింది. అనుకున్నపుడలా మళ్లీ పైకి లేచిన సందర్భాలే అన్నీ. మరి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ గాలి లెక్కలే. నిజం కావడానికి, కాకపోవడానికి కూడా సమానమైన చాన్సే వుంది.  కానీ అది కాదు విషయం. 

అసలు నిన్నటి వరకు కేసిఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ ఓటమి పాలవబోతోంది అని కోడై కూసాయి మీడియా సంస్థలన్నీ. మొహమాటానికి పోటా పోటీ అన్నాయి కానీ, వాస్తవానికి రాతల్లో మహా కూటమి వైపు ముగ్గు అయితే కనిపించింది. నెల రోజుల క్రితం వరకు కెసిఆర్ కు తిరుగు లేదు. ప్రతిపక్షమే లేదు. పోటీ లేదు అన్న పరిస్థితి. అలాంటిది చంద్రబాబు రాజకీయం ఫుణ్యమా అని మొత్తం సీన్ మారిపోయింది.

మహాకూటమి అంటూ దాదాపుగా ప్రతిపక్షాలు అన్నీ ఏకమయ్యాయి. బలమైన పోటీ ఇచ్చాయి. మహా మహా నాయకులు అందరూ తెలంగాణ మీదే కన్నేసారు. సోనియా, రాహుల్, చంద్రబాబు, మోడీ, అమిత్ షా ఇలా ప్రతి ఒక్కరు తెలంగాణకు వచ్చి కేసిఆర్ పై నిప్పులు కురిపించి వెళ్లారు. మరోపక్క సెటిలర్లు యునానిమస్ గా యాటీ కేసిఆర్ స్టాండ్ తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్ 80శాతం వుంటుందని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా 72 నుంచి 73శాతం సగటు ఓటింగ్ వున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ హైదరాబాద్ అర్బన్ ఏరియాలో మాత్రం ఓటింగ్ శాతం 62 దగ్గరే ఆగిపోయినట్లు కనిపిస్తోంది.

ఇలాంటి పోలింగ్ తరువాత ఒక్క లగడపాటి సర్వే మినహా మిగిలిన సర్వేలన్నీ టీఆర్ఎస్ విజేత అన్నట్లుగా తేల్చేసాయి. లగడపాటి సర్వేలో కూడా 35 ప్లస్ ఆర్ మైనస్ 10 అన్నారు. అంటే ఒకవేళ ప్లస్ అయి 45 వస్తే, భాజపా 7, మజ్లిస్ 7, ఇండిపెండెట్లు ఏడు వేరు చేస్తే...66 పోగా మహా కూటమి 54 కే పరిమితం అయ్యే ప్రమాదం వుంది. లగడపాటి సర్వే తరువాత ఇండిపెండెంట్లకు కచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. 

ఒకవేళ్ మిగిలిన సర్వేలు నిజమై కేసిఆర్ అధికారంలోకి మళ్లీ వస్తే, కనుక, మరోసారి కేసిఆర్ అదృష్టవంతుడు అని రుజువు అవుతుంది. పడిన ప్రతిసారీ లేచినట్లే, ఈసారీ లేచినట్లు అవుతుంది.

Show comments