ఎన్టీఆర్‌ పేరుతో బాలకృష్ణ సరదా!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ పేరు చెప్పి తండ్రి వేసిన గెటప్స్‌ అన్నీ వేసే సరదాని బాలకృష్ణ ఒకేసారి తీర్చుకుంటున్నాడా? ఈ చిత్రం పబ్లిసిటీ జరుగుతోన్న తీరు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయం చూస్తే అదే అనిపిస్తోంది. ఎన్టీఆర్‌ జీవితాన్ని సినిమా, రాజకీయాలుగా విడగొట్టి రెండు భాగాల్లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.

మొదటి భాగంలో ఎన్టీఆర్‌ సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఎలా ఎదిగారు? అన్నది మాత్రం చూపిస్తారట. దీని వల్ల సినిమా అంతటా షూటింగ్‌ కోలాహలం, అప్పటి ఎన్టీఆర్‌ పాపులర్‌ సీన్లు, పాటలని బాలకృష్ణ మరియు తారాగణం మరోసారి కెమెరా ముందు చేయడమే ఈ తంతులో వుంటుందట.

సావిత్రి జీవిత కథని తెరకెక్కిస్తే అక్కడక్కడా సినిమాలు టచ్‌ చేసినా కానీ ఆమె జీవితాన్నే ఎక్కువ చూపించారు. కానీ ఈసారి మాత్రం బాలకృష్ణ తండ్రి చేసిన ప్రతి హిట్‌ పాటా వుండాలని, ప్రతి హిట్‌ సీన్‌ పెట్టాలని అడగడంతో అవన్నీ ఎడిట్‌ చేయలేక రెండు భాగాలు చేసారట.

మొదటి భాగానికి క్రేజ్‌ పరంగా ఢోకా వుండదు కానీ ఇది కానీ నిరాశ పరిస్తే తర్వాత వచ్చే భాగానికి ఆదరణ కరవయ్యే ప్రమాదం వుందనేది పబ్లిక్‌ కామెంట్‌.

Show comments