నో మెగా..ఓన్లీ అల్లు

మెగా హీరోల్లో ఒకరిగానే అల్లు అర్ఙున్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అది వాస్తవం. ఇప్పుడు ఎదిగి వుండొచ్చు కానీ ఫౌండేషన్ మాత్రం మెగాక్యాంప్ నే. కానీ ఇప్పుడు బన్నీ మెగా క్యాంప్ కు దూరంగా ఙరుగుతున్నట్లు కనిపిస్తోంది. 

బాలయ్య లాంటి సీనియర్ హీరో తన సినిమా ఫంక్షన్ కు బన్నీ ని చీఫ్ గెస్ట్ గా తెచ్చుకున్నారు. అది కచ్చితంగా బన్నీ ఎదుగుదలకు నిదర్శనమే. కాదనలేరు ఎవ్వరూ. కానీ బన్నీ అదే ఫంక్షన్ లో పొరపాటున కూడా మెగా అన్న పదం వాడలేదు. 

అల్లు కుటుంబానికి నందమూరి కుటుంబానికి బంధం అంటూ చెప్పుకు వచ్చారు. తన అభిమానులు అన్న పదమే వాడారు తప్ప మెగాభిమానుల అన్న పదం వదిలేసారు.

ఇవన్నీ అలా వుంచితే బాలకృష్ణకు వున్న డిక్షన్, వాచకం ఎవ్వరికీ లేదనే పెద్ద కితాబు ఇచ్చేసారు. బాలయ్యకు డిక్షన్ వుండొచ్చు. మరి ఎవ్వరికీ లేదనడం చిత్రం. మోహన్ బాబు తనకు అద్భుతమైన వాచకం వుందంటారు. మెగాస్టార్ కు కూడా మాంచి వాచకమే వుంది. కానీ బాలయ్య ఒక్కరికే వుందని అనడం మెగాభిమానులను కాస్త చిన్న బుచ్చడమే.

అంతే కాదు తన స్పీచ్ లో రాఙమౌళి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బన్నీ ఏం చేసినా అది స్పెషల్ నే.

Click Here For Photo Gallery

Show comments