మళ్లీ తెరపైకి కృష్ణ-మహేష్ కాంబినేషన్

కెరీర్ స్టార్టింగ్ లో కొడుకు కోసం కృష్ణ బాగానే కష్టపడ్డారు. మహేష్ నటించిన సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించారు. కానీ అలా కృష్ణ కనిపించిన మహేష్ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ ఇన్నేళ్లకు మహేష్ సినిమాలో కృష్ణ కనిపించారు. కానీ ఈసారి సినిమా ఫ్లాప్ అవ్వలేదు. అదే సరిలేరు నీకెవ్వరు. 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో అల్లూరి సీతారామరాజు క్లిప్స్ వాడారు. సందర్భోచితంగా వాడిన ఆ క్లిప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మహేష్-కృష్ణ కలిసి మరోసారి తెరపై కనిపించాలనే డిమాండ్స్ పెరిగాయి. దీనిపై మహేష్ కూడా సానుకూలంగా స్పందించాడు. 

"నేను, నాన్న కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. మాతో సినిమా తీయడం అనీల్ రావిపూడికి మాత్రమే సాధ్యం అవుతుంది. నాన్నగారు కూడా ఎందుకో సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన తర్వాత ఓ సారి అనీల్ రావిపూడిని కలవాలని ఉందన్నారు. నాన్న ఎప్పుడూ ఇలా ఒకర్ని కలుస్తానని అడగలేదు."

ఇలా తమ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు మహేష్. దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న మహేష్.. ఆ సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు.

Show comments