రోజుకు 84 కిలోమీటర్ల పరుగు

రోజుకు కిలోమీటర్ నడవడానికి బద్ధకిస్తుంటారు చాలామంది. కానీ ఈ మహిళ మాత్రం ఏకథాటిగా 12 రోజులు పరుగెత్తింది. ఏకంగా వెయ్యి కిలోమీటర్లు కవర్ చేసింది. ఈ క్రమంలో థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్ దేశాల్ని కవర్ చేసింది. ఆమె పేరు నటాలీ డౌ.

52 ఏళ్ల నటాలీ అల్ట్రా మారథాన్ లో పేరు తెచ్చుకుంది. తన టాలెంట్ తో సమాజానికి ఏదైనా చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల పరుగును ప్రారంభించింది.

పరుగు ప్రారంభించిన మొదటి రోజే ఆమె నడుముకు గాయమైంది. మూడో రోజు మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. అయినా నటాలీ వెనక్కి తగ్గలేదు. రోజుకు కనీసం 84 కిలోమీటర్లు పరుగెత్తింది. ఈ క్రమంలో వేడికి ఆమె వేసుకున్న షూ కరిగిపోయింది.

ఇలా ఎంతో కష్టపడి వెయ్యి కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది నటాలీ. ఈ క్రమంలో ఆమె ఓ గిన్నిస్ రికార్డ్ కోసం కూడా వెయిట్ చేస్తోంది. అత్యంత వేగంగా మలేషియా బోర్డర్ ను కాళ్లతో క్రాస్ చేసిన మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. Readmore!

ఇంతకీ ఇదంతా నటాలీ ఎందుకు చేసిందో తెలుసా? ఓ ఛారిటీ కోసం. జీఆర్ఎల్ఎస్ అనే గ్లోబల్ ఛారిటీ సంస్థ, మహిళలకు, విద్యార్థినులకు క్రీడల్లో, లీడర్ షిప్ క్వాలిటీస్ లో శిక్షణ ఇస్తుంది. ఆ సంస్థకు విరాళాలు సేకరించడం కోసం నటాలీ ఇంత సాహసం చేసింది. 50వేల డాలర్ల విరాళాలు సేకరించగలిగింది.

Show comments