కన్న తల్లిదండ్రుల్ని హత్య చేసి..!

ఈకాలం అనుబంధాలు-ఆత్మీయతలకు తావులేదని నిరూపిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అంతా డబ్బు మయం అయిపోయింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని సైతం కడతేర్చడానికి వెనకాడ్డం లేదు. నర్సాపూర్ లో జరిగిన దారుణం వెనక కూడా ఇదే కోణం బయటపడింది.

తెలంగాణలోని నర్సాపూర్ లో నెల రోజుల కిందట జరిగిన జంట హత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే ఈ హత్యలకు పాల్పడినట్టు కనిబెట్టిన పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా సాదుల్ నగర్ కు చెందిన లక్ష్మణ్ విపరీతంగా అప్పులు చేశాడు. ఎక్కువ డబ్బును తాగుడుకు వాడేశాడు, మిగిలిన డబ్బును జూదంలో పెట్టాడు. ఇలా రోజురోజుకు అతడి అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు బంగారం ఇవ్వాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు.

ఓరోజు గొడవ తారాస్థాయికి చేరింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్, తల్లిదండ్రులిద్దర్నీ హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నర్సాపూర్ శివార్లలో ఉన్న చెరువు వద్ద మృతదేహాల్ని పడేశాడు. Readmore!

అనుమాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు, విచారణ చేపట్టారు. కానీ ఎన్ని రోజులైనా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అనుమానం వచ్చి లక్ష్మణ్ కోణంలో దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటపడింది.

Show comments