బెంగళూరు.. ఢిల్లీ.. తరువాత హైదరాబాద్!

ఈ ఏడాది రెండు పెద్ద నగరాలు నీటి ఎద్దడిని చవిచూసాయి. బెంగళూరు, ఢిల్లీ నగరాలు ఈ వేసవిలో నీటి కొరతను బలంగా ఎదుర్కొన్నాయి. బెంగళూరు అయితే గేటెడ్ కమ్యూనిటీల నుంచి సాదా సీదా బస్తీల వరకు నీటి కొరతతో కొన్నాళ్ల పాటు తల్లడల్లి పోయింది. ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. నిజానికి ఢిల్లీకి ఎండలతో పాటు వర్షాలు కూడా బాగానే వుంటాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి నీటి సరఫలా కూడా బాగానే వుంటుంది. కానీ రకరకాల కారణాల వల్ల నీటి కొరత తప్పలేదు.

ఇప్పుడు ఈ రెండు నగరాలను చూసి హైదరాబాద్ నేర్చుకోవాల్సి వుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ నీటి కొరతతో చాలా బాధపడేది. రెండు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చిన సందర్భాలు వున్నాయి. మంజీరా, కృష్ణా, గోదావరి వంటి నదుల నీళ్లు హైదరాబాద్ తీసుకువచ్చి, పాలకులు కాస్త మంచి పని చేసారు. అప్పటి వరకు 24 హవర్స్ వాటర్ అనే లైన్ కనిపించేది అపార్ట్ మెంట్ బ్రోచర్లలో. దాని కోసం ఒకటి నుంచి రెండు బోర్ వెల్స్ కోసేవారు.

ఎప్పుడైతే మంజీరా, కృష్ణ, గోదావరి నీళ్లు రావడం ప్రారంభమైందో, అపార్ట్ మెంట్లలకు, లెక్కలు కట్టి నీటి సరఫరా ప్రారంభించారు. దానికి తగిన ఫీజు తీసుకోవడం మొదలుపెట్టారు. బిల్డర్లు కాస్త మామూళ్లు గట్రా ఇచ్చి, కొంచెం ఎక్కువ నీరు వచ్చేలా చేస్తూ వస్తున్నారు. దాంతో నీటి సమస్య ప్రస్తుతానికి అయితే లేదు.

పైగా భారీ గేటెడ్ కమ్యూనిటీలు పెరగడానికి ఈ నీటి సరఫరా అన్నది ఊతం ఇచ్చింది. ఇప్పుడు యాభై అంతస్ధుల వరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. వేలాది ఫ్లాట్స్ ఒకే చోట నిర్మాణమవుతున్నాయి. వీటన్నింటికి ప్రభుత్వ నీటి సరఫరా అన్నది కీలకంగా వుంది. అదే సమయంలో కొంత వరకు వాటర్ రీ సైక్లింగ్ అన్నది జరుగుతోంది. Readmore!

అంతా బాగుంటే ఫరవాలేదు. ఒకసారి కనుక ఈ నదుల నుంచి సరఫరా ఆగితే పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా వుంటుంది. ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. వర్షాలు కూడా రికార్డు స్ధాయిలో కొండల్లో కురిస్తే నదులు నిండుగా వుంటాయి. సమస్య వుండదు. అలా కాకుంటే, నదులు ఎండుతాయి. అప్పుడు హైదరాబాద్ అనే కాదు, పెద్ద నగరాలకు సమస్య అవుతుంది.

ప్రస్తుతం అందుబాటులో వున్న నీటి వనరులు, నీటి సరఫరా, ప్రస్తుత అవసరాలు, మరి కొన్నేళ్లకు ఏ మేరకు పెరుగుతాయి ఇవన్నీ చూసుకుని, ప్రనుత్వాలు కొత్త ప్రాజెక్ట్ లకు నీళ్ల ఇవ్వడం చేయాలి. విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే, భవిష్యత్ లో అనుకోనిది జరిగి, నీటి సరఫరాలో తేడా వస్తే, పరిస్థితి దారుణంగా వుంటుంది.

అంతా బాగుంటుందనే అనుకోవాలి. కానీ అలా అనుకుంటూనే, ముందు జాగ్రత్తలు తీసుకుని, నిర్మాణాల ప్లానింగ్ ను కూడా క్రమ బద్దం చేయాలి. చూసీ చూడనట్లు గ్యాలన్లకు గ్యాలన్లు ఇచ్చుకుంటూ పోతే పరిస్థితి విషమించే ప్రమాదం వుంది.

Show comments