ఈనాడు పోలవరం స్టోరీ చదవితీరాలి

పోలవరం ప్రాజెక్ట్. అది ఎక్కడ వుందో తెలియని వాళ్లు, దాని లాభాలు, ఆయకట్టు సంగతులు కూడా తెలియని వాళ్లు సైతం కామెంట్ చేసే వారే. సోషల్ మీడియా ప్రభావంతో జగన్ కావాలని పోలవరం ప్రాజెక్ట్ ను భ్రష్టు పట్టించేసారని, అది పూర్తి కాకపోవడానికి తప్పంతా జగన్ దే అని కక్ష పెంచుకున్నారు. అలాంటి వారంతా ఈ రోజు ఈనాడు లో వచ్చిన పోలవరం స్టోరీని చదవాల్సిందే. అసలు పోలవరం పరిస్థితి ఏమిటి? అన్నది చాలా చక్కగా వివరించారు. అదంతా చదివిన తరువాత జగన్ చేసిన తప్పు లేదా చేతకాని తనం ఏమిటి అన్నది కాస్త అర్థం కావడం మాత్రం కష్టం.

ఎందుకంటే ఆ ఆర్టికల్ మొత్తం మీద జగన్ చేసిన తప్పిదం ఏమిటంటే వరద ముందు నుంచి డయాఫ్రేమ వాల్ ను రక్షించలేకపోవడం. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ లు మిగిలిన కట్టడాల్లో ఏవి ఎంత వరకు పటిష్టంగా వున్నాయో తేల్చాలట. అవన్నీ చంద్రబాబు ప్రభుత్వం నిర్మించినవే. మరి ఈ అయిదేళ్లకే వీక్ అయిపోయాయా? లేదా జగన్ ప్రభుత్వం నిర్వహించలేదని అంటారా? వంద ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా నిర్మించాల్సిన కట్టడాలు అవి. అవి అయిదేళ్ల మెయింట్ నెన్స్ సరిగ్గా లేకనే వీక్ అయిపోయాయా?

జగన్ హయాంలో పోలవరంలో ఏ స్ధాయి విధ్వంసం జరిగిందో లెక్కించాలట. అంటే జగన్ హయాంలో పోలవరం కట్టడాలు అన్నింటినీ పాడు పెట్టారా? పాడు చేసారా? పనులు అంతో ఇంతో జరుగుతూనే వున్నాయి కదా? అంటే గతంలో నిర్మించిన వాటి క్వాలిటీ పాపాన్ని జగన్ మీదకు తోసేస్తున్నారన్నమాట.

రెండో డిపిఆర్ మంజూరు చంద్రబాబు దిగేనాటికి ఎలా వుందో, ఇప్పటికీ అలాగే వుంది అంట. అది కేంద్రం ఇవ్వాల్సినది. మరి ఇన్నాళ్లూ జగన్ తప్పిదం అంటిరి కదా? చంద్రబాబు హయాంలో డయా ఫ్రేమ్ వాల్ నిర్మించారట, జగన్ హయాంలో దాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారట. అంటే జగన్ వెళ్లి వరదలకు అడ్డం పడలేకపోయారన్న మాట. అంతే కానీ ఆ నిర్మాణం చేపట్టినపుడే వరదలను దృష్టిలో పెట్టుకోకపోవడం కాదు. Readmore!

80 కోట్లతో గైడ్ బండ్ నిర్మిస్తే అది కుంగిపోయింది. నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్మించక అలా అయిందట. మరి అది ఎవరి హయాంలో నిర్మించారో చెప్పరేమి?

చంద్రబాబు హయాంలో 56 వేలకు కోట్లకు పైగా అంచనాలను కేంద్రం ఆమోదించింది, తరువాత కాస్ట్ కమిటీ 47 వేల కోట్ల మేరకు మార్చింది. ఇప్పటి వరకు కేంద్రం దానిని ఆమోదించనే లేదు. మరి తప్పు ఎవరిది? కూటమిలో వున్న భాజపా దా? జగన్ దా?

సోషల్ మీడియాలో పది మంది కలిసి కుక్క అంటే మేక కూడా కుక్కే. పోలవరం తప్పిదాలు మొత్తం జగన్ ఖాతాలో ఇలాగే వేసారు అని ఈ ఈనాడు స్టోరీ సునిశితంగా చదివితే అర్థం అవుతుంది. ఎంత జాగ్రత్తగా ఆ స్టోరీని డ్రాఫ్ట్ చేసారు అంటే, అక్కడ బోలెడు ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే అలా సమాధానాలు దొరికేలా రాస్తే తప్పు జగన్ దా? చంద్రబాబుదా అన్నది తెలిసిపోతుంది కదా?

Show comments