బాబు మాటలకు అర్ధాలు వేరులే!

టీడీపీ అధినేత మాటలకు అర్ధాలు వేరు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన ఎదుటి పక్షం మీదనే విమర్శలు చేస్తారు తప్ప తన పక్కన చూసుకునేది ఎప్పుడూ ఉండదని అంటున్నారు. పాయకరావుపేట, రాజాం సభలలో చంద్రబాబు తాజాగా పర్యటిస్తూ చేసిన కామెంట్స్ మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

రాజాం నుంచి చెల్లని ఎమెల్యేను తెచ్చి వైసీపీ పాయకరావుపేటలో పెట్టిందని అని బాబు విమర్శించారు. రాజాం సభలోనూ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. కానీ బాబు ఉత్తరాంధ్రాలో ఇదే రకమైన ట్రాన్స్ ఫర్లు చాలానే చేసారు. ఉత్తరానికి చెందిన గంటా శ్రీనివాసరావుని భీమిలీకి ట్రాన్స్ ఫర్ చేశారు. పెందుర్తిని చెందిన బండారు సత్యనారాయణమూర్తి ని మాడుగుల ట్రాన్స్ ఫర్ చేయబోతున్నారు.

ఎచ్చెర్లకు చెందిన కళా వెంకటరావుని చీపురుపల్లికి ట్రాన్స్ ఫర్ కొట్టారు. అదే ఎచ్చెర్లకు చెందిన మరో నేత కలిశెట్టి అప్పలనాయుడుని విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. ఇలా అనేక మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న బాబు వైసీపీ ట్రాన్స్ ఫర్లు అంటూ విమర్శలు చేయడమే విడ్డూరం అంటున్నారు.

వీటన్నిటికంటే పెద్ద వింత ఏంటి అంటే కడపకు చెందిన సీఎం రమేష్ ని తెచ్చి అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ పెట్టడం. ఇలా తాను చేస్తే ప్రజల కోసం సమర్ధులైన వారిని పోటీలో దించినట్లుగా చెప్పుకుంటారు. వైసీపీ చేతే అక్కడ చెత్తను తెచ్చి ఇక్కడ వేస్తారా అది బంగారం అవుతుందా అని దీర్ఘాలు తీస్తారు. దీని మీద వైసీపీ నేతలు బాబు వైఖరిని తప్పు పడుతున్నారు. బాబు విమర్శలు చేసే ముందు తన పార్టీ విషయం చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Show comments