విశాఖ జనసేనలో ముసలం

విశాఖ సౌత్ అసెంబ్లీ జనసేనలో ముసలం మొదలైంది. ఆ పార్టీ అభ్యర్ధిగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ వద్దు అంటూ ఆ పార్టీ నేతలు మీడియాకు ఎక్కారు దీని మీద జనసేన అధినేత పవన్ కి బహిరంగ లేఖ రాశామని కూడా వారు చెప్పారు.

వెంటనే వంశీని అభ్యర్ధిగా మార్చాలని ఆ పార్టీ నేతలు  డిమాండ్ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పోరేటర్ మహమ్మద్ సాదిక్, జనసేన మత్స్యకార సెల్ నేత మూగి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనకు విశాఖ సౌత్ లో బలం ఉందని చెప్పారు.

అటువంటి చోట నాన్ లోకల్ కి టికెట్ ఇవ్వడమేంటి అని పవన్ ని ప్రశ్నించారు. జనసేన కోసం గత అయిదేళ్ళుగా కష్టపడుతున్న వారిని కాదని ఒక్క రోజు కూడా పార్టీ జెండా మోయని వంశీకి టికెట్ ఇచ్చి పనిచేయమని చెప్పడమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన కోసం పనిచేస్తున్న సౌత్ లోని వారికి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని తాము గెలిపించుకుని వస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలం దాకా వంశీ వద్దు అంటూ ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాంతో ఆఖరులో వంశీ పేరు ప్రకటించారు.

వివాదం సద్దుమణిగింది అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో ఇపుడు ఇద్దరు కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా అధినాయకత్వం నిర్ణయాన్ని ప్రశ్నించడంతో జనసేనలో ముసలం మొదలైంది అని అంటున్నారు. జనసేనలో అసంతృప్తి ఉందని ఇప్పటికే వినిపిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి కలిసి వచ్చేలా ఉన్నాయని అంటున్నారు.

Show comments