విశాఖ పశ్చిమంలో వైసీపీకి పెరుగుతున్న గ్రాఫ్ !!

విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ గెలుపు దారులు సుగమం అవుతున్నాయా అంటే నిజమే అంటున్నాయి రాజకీయవర్గాలు! అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గత రెండున్నారేళ్లగా నియోజకవర్గంలో కలియ తిరిగి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువ చేయడం ద్వారా ప్రజల నుంచి మన్ననలు అందుకున్నారు. సొంత నిధులతో విద్య, వైద్య వంటి అనేక సమస్యల పరిష్కారానికి సొంత నిధులు ఖర్చు చేస్తూ, ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు.

ఏ కష్టం వచ్చినా, నేనున్నానని వెంటనే ఆదుకునే ఆయన మనస్తత్వం నియోజకవర్గం ప్రజలకు అకట్టుకుంది. దీనితో ఆడారి ఆనంద్ కి నియోజకవర్గంలో తిరుగులేదనే టాక్ నడుస్తోంది. ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజురోజుకీ జోష్ పెరుగుతోంది. ప్రచార కార్యక్రమాలు హుషారుగా సాగుతుండగా, ఓటర్ల నుంచి వస్తున్న స్పందన కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది.

నియోజకవర్గం వర్గంలో వైసీపీ పవనాలు వీస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 14 వార్డుల పరిధి కలిగిన నియోజకవర్గంలో వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇంచార్జ్ లు పార్టీ కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తుండడం, ఆడారి గెలుపు నల్లేరు పై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యే పై జనంలో వ్యతిరేకిత : 

వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకిత కనిపిస్తోంది. నియోజకవర్గంలో చెప్పుకొదగ్గ అభివృద్ధి జరగలేదు, సరిగా, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ముఖం చాటేయడం వైసీపీ అభ్యర్థి ఆడారికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. 2014, 2019 సంవత్సరాలలో గెలిచినప్పటికి, ఈ సారి విజయం వరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు.

ఎమ్మెల్యే గా రెండుసార్లు ఎన్నికైనా, ప్రజా సమస్యల పరిష్కారంలో వెనుకబడ్డారనే అపవాదు ప్రజల్లో వుంది. ఎన్నికల సమయంలో కనిపించే నాయకులకంటే, నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకునే పరిస్థితి నెలకొంటోంది.

అభివృద్ధి, సేవా, సంక్షేమమే: 

నియోజకవర్గంలో ఆడారి చేసిన అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలే ఆడారిని ప్రజలకు దగ్గర చేసింది. నియోజకవర్గంలో ₹263 కోట్లతో రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యలు పరిష్కారంతో పాటు, సొంత నిధులతో అనేకమందికి పెన్షన్ లు, విద్య, వైద్యానికి సంబందించి ఆర్ధిక సహాయాలు విజయం దిశగా పయనింపజేస్తున్నాయి. శ్రీ ఆడారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరాలు తరచూ నిర్వహిస్తూ, ఉచిత వైద్యం అందిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కు నియోజకవర్గంలో బ్రహ్మరధం పడుతున్నారు. 

మీతో ఆనంద్ యాప్: 

రాష్ట్రప్రభుత్వం గడప గడపకు స్పూర్తితో మీతో ఆనంద్ యాప్ సృష్టించి, సీఎం చేతులమీదుగా ప్రారంభింపజేసి ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చారు. విశాఖ వెస్ట్ వాసులు తమ సమస్యను ఈ యాప్ లో అప్లోడ్ చేసి ... పరిస్కారం పొందొచ్చు. అంటే నాయకుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కాదు - ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా యాప్ లో సమస్యను అప్లోడ్ చేస్తే అది ఆడారి ఆనంద్ కు చేరుతుంది. అంటే యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలన్నమాట.

విశాఖ డైరీ పాలలాగే ఆనంద్ మనసు స్వచ్ఛం, తన హృదయమెప్పుడూ పేదవాని కోసం కొట్టుకుంటుంది - తన తండ్రి లాగే చెరగని ముద్రవేసుకోవాలని మనసు తపిస్తుంది. ఓట్ల వేటకాదు ప్రజల పాట్లు తీర్చడమే ముఖ్యమంటారాయన. విశాఖ డైరీ ఉద్యోగులు, పాడి రైతులు, కోట్లమంది వినియోగదారుల సంక్షేమంకి ఇచ్చిన ప్రాధాన్యతే ప్రజలందరికీ ఇస్తారు ఆనంద్. వారి కష్టం చుస్తే కరిగిపోతారు - సుఖంగా ఉన్నారని తెలిస్తే ఆనందిస్తారు, నిత్య కృషీవలుడు ఆడారి ఆనంద్.

తనకు జన్మనిచ్చిన తండ్రికి , ఏరికోరి ఎన్నో పదవులిచ్చిన సీఎం జగన్ , ఆశీర్వదిస్తున్న ప్రజలకు, ఎప్పుడూ రుణపడి ఉంటానని అంటారు ఆడారి ఆనంద్. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు ఆడారి ఆనంద్.

Show comments