తమ్ముళ్ళకు పార్టీ పదవులతో బుజ్జగింపు !

వైసీపీలో తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని టీడీపీలోకి తిరిగి వచ్చిన అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు టీడీపీ అధినాయకత్వం పార్టీ పదవి ఇచ్చింది. చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి దాడిని పిలిపించుకుని మాట్లాడారు అని అంటున్నారు. దాడికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ని జనసేనకు పొత్తులో భాగంగా ఇచ్చారు దాంతో దాడికి పార్టీ పదవితో సరిపెట్టారు అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల వ్యవహారాలు, పత్రికా సమావేశాల నిర్వహణ కో ఆర్డినేటర్ అన్న పదవిని దాడికి ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులను సమీక్షించడం అలాగే పార్టీకి వాయిస్ గా మారి ఎప్పటికపుడు బలమైన వాణిని వినిపించడం చేయాలని ఈ పదవి ఇచ్చినట్లుగా చెప్పారు.

అనకాపల్లిలో మరో నేత దాడి కుమారుడు దాడి రత్నాకర్ కి టీడీపీ రాష్ట్ర పార్టీలో కీలక పదవి ఇచ్చారు. అనకాపల్లి టికెట్ ఆశించిన మరో నేత బుద్ధా నాగజగదీశ్వరరావుకు కూడా పార్టీ పదవి ఇవ్వడం ద్వారా అనకాపల్లి అసంతృప్తిని సద్దుమణిగేలా బాబు చేశారు అని అంటున్నారు.

ఈ పదవులతో సంతృప్తి పడి నేతలు అంతా పనిచేస్తారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తమ్ముళ్లను నచ్చచెబుతూ పార్టీ పదవులు కట్టబెడుతూ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అంటున్నారు. తమ్ముళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Show comments