ఆమె అతి.. స‌న్న‌గా లేద‌య్యా సామి!

బంగి అనంత‌య్య గుర్తున్నారా? క‌ర్నూలు మాజీ మేయ‌ర్‌. చిత్ర‌విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో నిత్యం వార్త‌ల్లో క‌నిపించేవారు. బంగి అనంత‌య్య‌కు విప‌రీత‌మైన ప్ర‌చార పిచ్చి. స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల‌తో సంబంధం లేకుండా, ఏదో ఒక‌టి చేస్తూ మీడియాలో నిత్యం క‌నిపించేవారు. ఆయ‌న్ను మ‌రిపించేలా అదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి అఖిల‌ప్రియ విప‌రీత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అఖిల‌ప్రియ‌కు ప్ర‌చార పిచ్చి ప‌ట్టింద‌నే అభిప్రాయం వుంది. తాజాగా నంద్యాల జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సీఎం జ‌గ‌న్‌ను క‌లిసే సాకుతో అఖిల‌ప్రియ ఓవ‌రాక్ష‌న్ ఓ రేంజ్‌లో వుంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి విడుద‌ల కోసం జ‌గ‌న్‌కు వినతిప‌త్రాన్ని ఇచ్చేందుకంటూ ఇద్ద‌రు రైతుల్ని వెంట‌బెట్టుకుని వెళ్లారామె. ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ అభ్య‌ర్థి అయిన అఖిల‌ప్రియ‌ను పోలీసులు అడ్డుకున్నారు.

అఖిల‌ప్రియ‌తో పాటు ఆమె వెంట వ‌చ్చిన ఒక‌రిద్ద‌ర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక సీన్ క్రియేట్ చేసి, మీడియాలో కాసేపు అఖిల‌ప్రియ హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. అఖిలప్రియ కోరుకున్న‌ది కూడా ఇదే. విన‌తిప్ర‌తం ఇచ్చేందుకు వ‌స్తే అరెస్ట్ చేయ‌డం ఏంటంటూ ఆమె మీడియా ఎదుట ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌కు రెండు నెల‌ల్లో తీర్పు వెలువ‌డ‌నుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న సీఎం వ‌ద్ద‌కు ప్ర‌తిప‌క్ష పార్టీ అభ్య‌ర్థిగా వెళ్లాల‌ని అనుకోవ‌డం, ఆమె అతికి నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. త‌న పాల కేంద్రానికి రైతుల భూముల్ని త‌న‌ఖా పెట్టి కోట్లాది రూపాయ‌లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. వాటిని చెల్లించ‌క‌పోవ‌డంతో రైతుల‌కు బ్యాంకుల నుంచి నోటీసులు వెళ్లాయి.

భూమా నాగిరెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత లోన్ల‌కు సంబంధించి రెగ్యుల‌ర్‌గా కంతులు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతుల‌కు బ్యాంకులు నోటీసులు పంపి, స్పందించ‌క‌పోవ‌డంతో డీపాల్ట‌ర్ల‌గా భావించి అస‌లుకే ఎస‌రు తెచ్చిన ఘ‌న‌త మాజీ మంత్రి కుటుంబానిది. న్యాయం ఏదైనా చేయాలంటే అలాంటి రైతుల‌కు . వారిని వెంట‌బెట్టుకుని సీఎం జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించి వుంటే బాగుండేద‌ని ఆళ్ల‌గ‌డ్డ రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈమె ఓవ‌రాక్ష‌న్‌తో ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జానీకం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Show comments