చంద్రబాబు: అవే కుయుక్తులు, అబద్ధాలు.. నో ఛేంజ్!

చంద్రబాబునాయుడుకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు రాజకీయంగా కూడా వార్ధక్యం వచ్చేసింది. ఆలోచనల్లో కూడా వార్ధక్యం వచ్చేసింది. ఎప్పుడో కొన్నేళ్ల కిందట ప్రజలను బురిడీ కొట్టించడానికి వాడిన ఆలోచనల్నే ఆయన ఇప్పటికీ వాడుతున్నారు. అవే తరహా అబద్ధాలను ఇప్పటికీ చెబుతున్నారు. అలాంటి కుయుక్తులు ప్రజల మీద పనిచేయడం లేదని ఆయన గ్రహించడం లేదు.

తాజాగా నగరి నియోజకవర్గం పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన చంద్రబాబునాయుడు రకరకాల హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. 60 రోజుల్లోగా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇది పెద్ద మాయగా నిరుద్యోగ టీచర్లు భావిస్తున్నారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన కసరత్తు తరువాత.. ఆల్రెడీ రాష్ట్రంలో డీఎస్సీని ప్రకటించారు. 6100 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం కూడా పూర్తయింది.

ఏప్రిల్ 30 లోగా పరీక్షల నిర్వహిణ కూడా పూర్తయ్యేలా కొత్త షెడ్యూలు విడుదల అయింది. అంటే ఎన్నికలకు ముందే డీఎస్సీ పరీక్షలు కూడా అయిపోతాయన్నమాట. బహుశా కొత్త సర్కారు ఏర్పడే సమయానికి నియామకాలు కూడా జరుగుతుంటాయి.

అయితే చంద్రబాబునాయుడు మాత్రం తాను అధికారంలోకి రాగానే 60 రోజుల్లో మెగా డీఎస్సీ అంటున్నారు. జగన్ ఏం చేస్తే అది ఫాలో కావడం, జగన్ ఏం చెబితే అదే తాను కూడా ఇంప్రొవైజ్ చేసి చెప్పడం చంద్రబాబుకు అలవాటే. 2019 ఎన్నికలకు పూర్వం.. వృద్ధుల పెన్షను రెండువేలకు పెంచుతానని జగన్ చెప్పగానే.. జాగ్రత్త పడిన చంద్రబాబునాయుడు అప్పటికి తాను అధికారంలో ఉన్నాడు గనుక.. వెంటనే రెండు వేలకు పెంచేసి. జగన్ ను దెబ్బకొట్టాలని చూశారు. ఆ పెంచడం అనేది తన పుణ్యమే గనుక.. జగన్ పట్టించుకోకుండా.. తనను గెలిపిస్తే మూడు వేలకు పెంచుతానని అన్నారు. అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారు కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ మూడువేల వంతున పెన్షను అందుతోంది.

అదే తరహాలో డీఎస్సీ విషయంలో కూడా చంద్రబాబునాయుడు, జగన్ ను కాపీ కొడుతున్నారని ప్రజలు అంటున్నారు. చిత్తశుద్ధిలేని ఆయన హామీలను ప్రజలు గుర్తిస్తున్నారని కూడా అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. అప్పటికే డీఎస్సీ పూర్తయి నియామక ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని, 60 రోజుల్లో మళ్లీ డీఎస్సీ అనడం కామెడీ అనిపించుకుంటుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Show comments