పరువు నిలబెట్టిన 'గాడ్ ఫాదర్'

గాడ్ ఫాదర్.. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా 'నాట్ ఏ బ్యాడ్ ఫాదర్' అనిపించుకుంది. వాల్తేరు వీరయ్య అంత హిట్ కాదు, అలా అని ఆచార్య అంత డిజాస్టర్ కూడా కాదు. అలా అని చిరంజీవి స్థాయికి తగ్గ సక్సెస్ కూడా కాదు. ఉన్నంతలో బాక్సాఫీస్ బరిలో చిరంజీవి పరువు కాపాడిన ఈ సినిమా, ఇప్పుడు బుల్లితెరపై కూడా పరువు నిలబెట్టింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారమైంది గాడ్ ఫాదర్ సినిమా. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ సినిమాకు 7.7 టీఆర్పీ వచ్చింది. గతంలో చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు వచ్చిన రేటింగ్ కంటే ఇది మెరుగైనది. ఇంకా చెప్పాలంటే, చిరంజీవి నటించిన సైరా సినిమా కంటే ఆచార్యకు, ఆచార్య సినిమా కంటే గాడ్ ఫాదర్ కు మంచి రేటింగ్స్ వచ్చాయి.

అలా అని దీన్ని ఘనమైన నంబర్ గా చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, టీవీల్లో గాడ్ ఫాదర్ కంటే బంగార్రాజు, ఎఫ్3, అఖండ లాంటి సినిమాలకు మంచి నంబర్స్ వచ్చాయి. ఇక రేటింగ్స్ లో రికార్డులు బద్దలుకొట్టిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో గాడ్ ఫాదర్ ను అస్సలు పోల్చి చూడలేం.

త్వరలోనే చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య కూడా టీవీల్లో ప్రత్యక్షంకాబోతోంది. ఈ సినిమాకు హయ్యస్ట్ టీఆర్పీలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Show comments