త్రివిక్రమ్ తో సినిమా.. నిధి అగర్వాల్ ఔట్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్ద డైరక్టర్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరూ వదులుకోరు. ప్రస్తుతం అతడితో సినిమా చేసేందుకు హీరోలంతా రెడీగా ఉన్నారు. ఇక హీరోయిన్లు అయితే కిందామీద పడి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకొని మరీ అతడి సినిమాల్లో నటించడానికి ఎగబడతారు. కానీ ఒకే ఒక్క విషయంలో త్రివిక్రమ్ దగ్గర ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడా బ్యాడ్ సెంటిమెంట్ నిధి అగర్వాల్ ను చుట్టుకునేలా ఉంది.

తన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెడతాడు త్రివిక్రమ్. మరీ ముఖ్యంగా సెకెండ్ హీరోయిన్ కాస్త హాట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం కూడా సెకెండ్ హీరోయిన్ రేసులో నిధి అగర్వాల్ పేరు వినిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే నెగెటివ్ సెంటిమెంట్ ఒకటి పుట్టుకొచ్చింది.

త్రివిక్రమ్ సినిమాలో సెకెండ్ హీరోయిన్లు క్లిక్ అయిన దాఖలాల్లేవ్. సినిమాలు ఎంత పెద్ద హిట్టయినా, అందులో సెకండ్ హీరోయిన్ కు వచ్చే క్రేజ్ నామమాత్రమే. ఉదాహరణకు అల వైకుంఠపురములో సినిమానే తీసుకుంటే, అందులో రెండో హీరోయిన్ గా నటించిన నివేత పెతురాజ్ కు ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ ఏమాత్రం కలిసిరాలేదు.

నివేతది కేవలం రీసెంట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అరవింద సమేతలో ఈషా రెబ్బా, అజ్ఞాతవాసిలో అను ఎమ్మాన్యుయేల్, అ..ఆలో అనుపమ, సన్నాఫ్ సత్యమూర్తిలో నిత్యామీనన్, అత్తారింటికి దారేదిలో ప్రణీత, జల్సాలో పార్వతి మెల్టన్.. ఇలా త్రివిక్రమ్ సినిమాల్లో రెండో హీరోయిన్ గా నటించిన భామలెవ్వరూ క్లిక్ అవ్వలేదు.

అందుకే త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ రోల్స్ అంటే భామలంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. అది మహేష్ బాబు సినిమా అయినా సరే. అసలే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న నిధి అగర్వాల్ లాంటి భామలైతే ఇంకాస్త గట్టిగానే ఆలోచించుకోవాలి మరి.

Show comments