బన్నీ కి కరోనా పాజిటివ్!

కరోనా ఎవరినీ వదలడం లేదు. ముందు వెనుక అంతే తేడా. హీరో, కమెడియన్, డైరక్టర్, ప్రొడ్యూసర్ అన్న తేడా లేదు. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ కు కూడా కరోనా సోకింది.

పుష్ప సినిమా షూట్ ను నిర్విరామంగా చేస్తున్నారు. అయితే ఈ మధ్య బన్నీ షూటింగ్ కు వెళ్లలేదు. కమెడియన్ సునీల్ సీన్లు అన్నీ కంప్లీట్ చేస్తున్నారు.

కానీ అంతకు ముందు వెళ్లిన ఫలితమో లేదా మరెవరి ద్వారానో సోకిందో కానీ మొత్తానికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని బన్నీనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు బోగట్టా. ఫ్రస్తుతం బన్నీ ఐసోలేషన్ లో వుంటున్నారని తెలుస్తోంది.

Show comments