బండ్ల గ‌ణేష్‌కు వ‌ర‌మిచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త‌. నిర్మాత , న‌టుడు బండ్ల గ‌ణేష్ తాజా ట్వీట్ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. బండ్ల గ‌ణేష్‌తో క‌లిసి సినిమా చేసేందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంగీక‌రించారు. ఈ విష‌యాన్ని నిర్మాత బండ్ల తాజా ట్వీట్‌లో వెల్ల‌డించాడు. బండ్ల గ‌ణేష్ ట్వీట్ సంగ‌తేంటో చూద్దాం.

"నా బాస్ ఓకే అన్నాడు. నా క‌ల మ‌రోసారి నిజ‌మైంది. నా దేవుడికి నా ధ‌న్య‌వాదాలు" అంటూ ప‌వన్‌తో దిగిన ఫొటోని బండ్ల గ‌ణేష్‌ షేర్ చేశాడు.  బండ్ల గ‌ణేష్ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు.  గబ్బ‌ర్ సింగ్ లాంటి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేయాల‌ని బండ్ల గ‌ణేష్‌కు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.  

బండ్ల గ‌ణేష్ చిన్న న‌టుడిగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి .... త‌క్కువ స‌మ‌యంలోనే పెద్ద నిర్మాత అవ‌తారం ఎత్తాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే ఆయ‌న‌కు పిచ్చి అభిమానం. ప‌వ‌న్‌ను త‌న దేవుడిగా అభివ‌ర్ణించ‌డం చాలా సంద‌ర్భాల్లో చూశాం. ప‌వ‌న్‌పై ఈగ వాలితే ఒప్పుకోడ‌నే పేరు సంపాదించాడు. తెలంగాణ‌లో 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌లో చేరి రాజ‌కీయ ప్ర‌వేశం చేశాడు. కానీ రాజ‌కీయాలు త‌న మ‌న‌స్త‌త్వానికి స‌రిపోవ‌ని త‌క్కువ స‌మ‌యంలోనే ప‌సిగట్టి ... నెమ్మ‌దిగా త‌ప్పుకున్నాడు.

సినిమాలే త‌న స‌ర్వ‌స్వం అని మ‌ళ్లీ టాలీవుడ్ వైపు మ‌న‌సు మార్చుకున్నాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అవ‌కాశం ఇస్తే సినిమా తీయాల‌నే కోరిక‌ను ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగంగా వ్య‌క్త‌ప‌రిచాడు. గ‌తంలో ప‌వ‌న్ హీరోగా గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాను తీసిన విష‌యం తెలి సిందే. ఇప్పుడు మ‌రోసారి అప్‌డేట్ అంటూ మెగా అభిమానుల‌కు కిక్ ఇచ్చే స‌మాచారాన్ని గ‌ణేష్ ట్వీట్ రూపంలో తెలిపారు.

త‌న నిర్మాణ సార‌థ్యంలో సినిమా తీసేందుకు అంగీక‌రించిన దేవుడికి గ‌ణేష్ ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం విశేషం. అలాగే బండ్ల ఆనందాన్ని చూస్తుంటే దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై వ‌ర‌మిచ్చిన‌ట్టుగా ఉంది. అన్న‌ట్టు సినిమా ద‌ర్శ‌కుడు, ఇత‌ర‌త్రా వివ‌రాలు త్వ‌ర‌లో తెలిసే అవ‌కాశాలున్నాయి.

'జ్యోతి' ఆర్కే అయోమయపు రాతలు

Show comments