ఉప ఎన్నికలకు నిమ్మగడ్డ పర్మిషన్ ఇచ్చారా బాబూ..?

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, వెంటనే ఉప ఎన్నికలు జరిపించండి.. డెడ్ లైన్లో ఇంకా 24 గంటలే మిగిలుంది.. ఇలా చంద్రబాబు అండ్ కో తమ కామెడీ ఎపిసోడ్ ని కొనసాగిస్తోంది. పోనీ మూడు రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారనుకుందాం. ఏపీలో ఉప ఎన్నికలు పెట్టే పరిస్థితులు ఉన్నాయా?

నిన్నమొన్నటి దాకా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, కట్టడి చేయడం ప్రభుత్వానికి సాధ్యం కావడంలేదు, అయ్యయ్యో నా రాష్ట్ర ప్రజలు ఏమైపోతున్నారో అని తెలంగాణలో తెగ బాధపడిపోయిన చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనుకుంటున్నారు.

పోనీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమైనా చంద్రబాబుకి హామీ ఇచ్చారా. రాజీనామాలు చేయించండి, వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తానని చెప్పారా?

స్థానిక ఎన్నికలకే దిక్కులేక నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇలాంటి టైమ్ లో అసెంబ్లీ ఎన్నికలంటే జనం నవ్వుతారు. పోనీ ఈ ఎన్నికలతో ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కేవలం టీడీపీ ఇగో శాటిస్ఫై చేసుకోవడం కోసమే రెఫరెండం, ఎన్నికలు అంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

రాజదాని వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోని కూడా పచ్చ మీడియాతో తమకి అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం టీడీపీకే చెల్లింది. రాను రాను చంద్రబాబు మరీ అల్పసంతోషిలా మారిపోతున్నారు. సచివాలయాలపై రంగులు తొలగించాలని కోర్టు చెప్పినందుకు టీడీపీ పండగ చేసుకుంది. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ తిరిగొస్తే పచ్చ కోటరీలో సంబరాలు జరిగాయి.

ఎన్నికల్లో గెలవలేని బాబు, ఇలా కోర్టు తీర్పులతో పండగ చేసుకుంటున్నారు. నిజంగా ఎన్నికలొచ్చినప్పుడు గెలవలేరు, గెలిచినవాళ్లని రాజీనామాలు చేయమంటారు. ఇదెక్కడి లాజిక్ అంటూ జనం చంద్రబాబుని చూసి నవ్వుకుంటున్నారు. 

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

Show comments