కరోనా నుంచి బయటపడిన హోమ్ మినిస్టర్

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనాను జయించారు. పూర్తి ఆరోగ్యంతో ఈరోజు ఆయన హాస్పిటల్ ను డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. తన బాగు కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.. మరో వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి, ఆ తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మహమూద్ అలీ. ఆయనకు ఆల్రెడీ ఆస్తమా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే కుటుంబ సభ్యులు అనుమానించినట్టుగానే కరోనా టెస్టుల్లో అలీకి పాజిటివ్ వచ్చింది. కాస్త ముందునుంచే హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడంతో వైరస్ నుంచి త్వరగా బయటపడగలిగారు హోమ్ మినిస్టర్.

మరోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ లో పనిచేస్తున్న సిబ్బందిలో 20 మందికి కరోనా పాటిజివ్ రావడంతో యంత్రాంగం ఉలిక్కిపడింది. వెంటనే సంబంధిత వ్యక్తుల్ని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్ కు తరలించారు. అయితే ప్రగతిభవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇటు హైదరాబాద్ లో కరోనా రోజురోజుకు విశృంఖలంగా విజృంభిస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న వేలాది కుటుంబాలు నగరాన్ని వదిలి కుటుంబాలతో తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రజలు బోర్డర్ దాటి ఏపీలోకి వెళ్లిపోతున్నారు.

నగర ప్రజలు కరోనా విషయంలో భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని... చాలా సురక్షితమైన ప్రాంతం హైదరాబాద్ అని అంటున్నారు సీపీ అంజ‌నీకుమార్. సెటిలర్స్ మాత్రం ఇప్పుడు ఎవ్వరిమాట వినేలా లేరు. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి సీన్ లోకి వచ్చి విస్పష్టంగా ప్రకటన చేస్తే తప్ప నగర ప్రజల్లో ఉద్రిక్తత తగ్గేలా లేదు.

ఇక నుంచి నో లంచం నో దళారీ

కోహ్లీ.. గాలిలో చప్పట్లతో

Show comments