జగన్ ను కలిసేందుకు ఆర్కే యత్నాలు?

జగన్ అంటే గత దశాబ్దకాలంగా ఉప్పునిప్పులా వుంటున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మనసు మార్చుకుంటున్నారా? మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఓసారి జగన్ ను కలిసి మాట్లాడాలకనుకుంటున్నారా? వైకాపా రాజకీయ వర్గాల్లో ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ అపాయింట్ మెంట్ కోసం ఆర్కే ప్రయత్నిస్తున్నారని, జగన్ పాలన ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా ఇంటర్వ్యూ (గతంలో చంద్రబాబును ఆర్కే ఇలాగే ఇంటర్వ్యూ చేసారు) కోసమో, లేదా మరెందుకో, ఆర్కే అపాయింట్ కోసం ప్రయత్నిస్తున్నారని వైకాపా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  తెలంగాణలోని ఓ కీలకనేత సహకారంతో ఆర్కే ఈ ప్రయత్నం చేస్తున్నారని గ్యాసిప్ వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది.

ఇది నిజమో, కాదో తెలియదు కానీ, జగన్ అంటే పడని, మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసిన ఓ ఛానెల్ అధినేత ఇటీవలే జగన్ ను కలిసి వచ్చారు. ఆయన దాదాపు ఆరు నెలలుగా జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. ఆఖరికి ఇటీవల సెట్ అయింది. ఆ ఛానెల్ అధినేత, తన తరువాత ఛానెల్ కు వారసురాలైన కుమార్తెను తీసుకుని వెళ్లి, మాట్లాడి వచ్చారని తెలుస్తోంది.

ఇది తెలిసిన తరువాత ఆర్కే కూడా జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారనే గ్యాసిప్ వైకాపా వర్గాల్లో వినిపించడం ప్రారంభమైంది. మామూలుగా అయితే నిప్పు లేకుండా పొగరాదు. కానీ రాజకీయాల్లో పొగ రావడానికి నిప్పే వుండక్కరలేదు. కాలక్షేపం కబుర్లు అనేకం వుంటాయి. అవి పొగ రాజేస్తూనే వుంటాయి. 

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?

నాయకుడంటే అర్థం తెలిసింది

Show comments