చంద్రబాబు ఆస్తుల విలువ కళ్లు చెదిరే స్థాయిలో!

తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువను తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ప్రతియేటా ఆస్తుల ప్రకటన అంటూ.. ఏవో చిల్ల పెంకులు మాత్రమే  తమ వద్ద ఉన్నట్టుగా ప్రకటించుకునే నారా కుటుంబం ఇప్పుడు మాత్రం అసలు కథను చూపించింది. బాబు, ఆయన భార్య పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ ఏడువందల కోట్ల రూపాయలు!

ఏపీ సీఎం, ఆయన భార్య పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ అక్షరాలా ఏడు వందల కోట్ల రూపాయలు. వీటిల్లో నారా భువనేశ్వరి పేరిట రూ.574 కోట్ల చరాస్తులు, ఆమె పేరిట తొంబై ఐదు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఇక బాబు, ఆయన భార్య ఆస్తులు ఇలా కళ్లు చెదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. అయితే గత ఎన్నికలప్పుడు బాబుగారు తన ఆస్తుల విలువ కేవలం 176 కోట్ల రూపాయలుగానే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే ఐదేళ్లలో బాబుగారి ఆస్తుల విలువ ఏడాదికి వంద కోట్ల రూపాయల మేర పెరిగింది. మూడు రోజులకు ఒక కోటి రూపాయల చొప్పున బాబు ఆస్తుల విలువ పెరగడం విశేషం.

 ఇక లోకేష్ ఆస్తుల కథ వేరే! తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తుల గురించి లోకేష్ చేసిన ప్రకటన కూడా భారీగానే ఉంది. తన ఆస్తుల విలువ 375 కోట్ల రూపాయలు అని లోకేష్ పేర్కొన్నారు. ఇందులో మెజారిటీ వాటా లోకేష్ పేరు మీదే ఉన్నాయి. 253 కోట్ల 68 లక్షల రూపాయ చరాస్తులు లోకేష్ కు ఉన్నాయట. మిగతా 66 కోట్ల రూపాయల చిల్లర స్థిరాస్తులట. ఇక బ్రహ్మణి పేరిట మొత్తంగా పద్దెనిమిది కోట్ల రూపాయల వరకూ ఆస్తులున్నాయట! దేవాన్ష్ పేరిట మరో ఇరవై కోట్ల రూపాయల మొత్తం ఆస్తులు ఉన్నట్టుగా లోకేష్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఏతావాతా నారా కుటుంబ ఆస్తులు అఫిడవిట్ లో చూపినవే వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. ఇక వీటి మార్కెట్ విలువ రేంజ్ ఎంతో!

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..

Show comments