నాని మళ్లీ డబుల్ రోల్?

నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. మంచి సబ్జెక్ట్, మంచి పెర్ ఫార్మెన్స్ కు అవకాశం వున్న సినిమా అని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ వుంది. మళ్లీ రావా సినిమాతో సక్సెస్ కొట్టిన డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. 36ఏళ్ల వయసులో రంజీ ట్రొఫీకి ఆడగలిగే రేంజ్ కు చేరే హీరో కథే జెర్సీ.

అయితే ఈ సినిమాకు సంబంధించి లెటెస్ట్ న్యూస్ ఏమిటంటే, హీరో నాని ఇందులో డబుల్ రోల్ లో కనిపిస్తాడన్నది. తండ్రి కథను కొడుకు నోట చెప్పించే విధమైన స్క్రీన్ ప్లే ఏదో వుంటుందట ఈ సినిమాలో. ఆ కొడుకుగా కూడా నానినే కనిపిస్తాడని తెలుస్తోంది.

కొడుకు పాత్రకు అంత పెద్ద ప్రాధాన్యత వుండదు కానీ, వేరే వాళ్లు కాకుండా నానినే కనిపించడం వల్ల ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇదిలావుంటే సినిమాలో రంజీ క్రికెట్ రాజకీయాలు కూడా లైట్ గా టచ్ చేస్తారని తెలుస్తోంది.

హీరో వీటన్నింటిని అధిగమించి ఎలా బ్యాట్ పట్టుకుని క్రీజ్ లో దిగాడు అన్నది సినిమా అన్నమాట.

ఇదేం సినీ అభిమానం.. ఏ రాతి యుగంలో ఉన్నాం?!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది?

Show comments