మెగాహీరో రూమర్లకు చెక్ చెప్పాలి

అనుకోనిదే ప్రమాదం. అలాంటి ప్రమాదం జరిగి ప్రాణాలతో పోరాడి మృత్యుంజయుడై ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. తరువాత చాలా కాలం రెస్ట్ తీసకుని సెట్ మీదకు వచ్చారు. అప్పటి నుంచి ఒకటే రూమర్లు వినిపించడం ప్రారంభమైంది. 

గతంలో అంత యాక్టివ్ గా లేరని, ఆరంభంలో చేసిన షూట్ కొంత రీ షూట్ చేయాల్సి వుంది. యాక్షన్ సీక్సెన్స్ లు లాంటివి చేయడం కష్టమని ఇలా వినిపిస్తోంది.

నిజానికి హీరో గతంలో కన్నా ఫిట్ గా వున్నారు. నలుగురిలో బాగానే కలుస్తున్నారు. అయితే షూటింగ్ లు ఎలా జరుగుతున్నాయో, అక్కడ ఏ మేరకు యాక్టివ్ గా వుంటున్నారో తెలియదు. రీ షూట్ మాట ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు. 

ఇదిలా వుంటే చిరంజీవి ఇంట్లో జరిగిన కమల్, సల్మాన్ గెట్ టు గెదర్ కు కూడా సాయి ధరమ్ తేజ్ వచ్చారు. ఆ విడియోలు, అవుట్ పుట్ చూసి మళ్లీ ఇదే డిస్కషన్. ఏమిటిలా వున్నారు హీరో అంటూ.

సినిమా టైమ్ లో తప్ప మామూలు టైమ్ లో సాయి ధరమ్ తేజ్ అస్సలు మేకప్ వేసుకోరు. దానికి తోడు ఆయన చకచకా అందరితో కలవరు. ఇవన్నీ ఒకటికి ఒకటి కలిపి, ప్రస్తుతం ఆయన సినిమా కెరీర్ మీద రూమర్ల మొదలయ్యాయి. హెల్త్ తో సమస్య కాదు. చలాకీతనంతో సమస్య అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా క్లారిటీ ఇచ్చి వీటికి చెక్ చెప్పాలి. 

Show comments