పెరుగుతున్న కేసులు! పరారీలో కోడెల దూడలు!

ఒకవైపు కోడెల దూడల బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదట్లో చిన్న చిన్న వ్యవహారాలు బయటకు రాగా.. ఇప్పుడు కోడెల శివప్రసాద్ రావు తనయుడు శివరాం, కూతురు విజయలక్ష్మిల బాధితులు పుట్టల్లోంచి  వచ్చే చీమల్లా వస్తూ ఉన్నారు. తమతో లక్షల రూపాయల వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. 

బిల్డర్ల దగ్గర నుంచి బజ్జీల బండి వరకూ ఎవరినీ కోడెల దూడలు వదల్లేదని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా వారు వదల్లేదని అలాంటి వసూళ్లతోనే సత్తెనపల్లిలో కోడెల చిత్తు అయ్యాడని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. అలాంటి బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు.

తమతో ఎంత వసూలు చేశారనే అంశం గురించి ఆధారాలను సైతం సమర్పిస్తున్నారు. ఇప్పటివరకూ కోడెల సంతానంపై నమోదు అయిన కేసుల సంఖ్య పది అని సమాచారం. ఈ  సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇప్పుడు కోడెల శివరాం, పూనాటి విజయలక్ష్మిలు పరారీలో ఉన్నారని, వారు ఎవరికీ అందుబాటో లేరని, ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి.

అరెస్టు భయంతో వారు పరార్ అయ్యారని  సమాచారం. అలాగే ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారట! తాము నీతిమంతులం అని కోడెల శివప్రసాదరావు చెప్పుకొచ్చారు. మరి అలాంటప్పుడు పరార్ కావాల్సిన అవసరం ఏమొచ్చిందో ఆయనకే తెలియాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పవనమా? ఋతుపవనమా? ఈ పవనమెటు?

Show comments