లోక్ సభలో కాంగ్రెస్ నేతకు సొంతూళ్లో ఎదురుగాలి!

ఐదేళ్లపాటు లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరించిన మల్లిఖార్జున్ ఖర్గేకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే విజయం తేలిక ఏమీకాదని క్షేత్రస్థాయి పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యనేతలు ఎంతోమంది ఎంపీలుగా పోటీచేసి ఓడిపోయారు. అయితే కర్ణాటకలో మాత్రం కొందరు సీనియర్లు నెట్టుకొచ్చారు.

చిక్ బళ్లాపూర్ నుంచి, కళబురిగి(గుల్బర్గా) నుంచి ఖర్గేలు విజయం సాధించారు. ఖర్గే సీనియారికి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆయనకు లోక్ సభలో పార్టీనేత బాధ్యతలు అప్పగించింది. ఈ ఎన్నికల్లో మాత్రం అటు ఖర్గేకు, ఇటు మొయిలీకి కూడా ఎదురుగాలి వీస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కళబురిగిలో ఈసారి బీజేపీ జెండా పాతడం ఖాయమని అంటున్నారు. అలాగే చిక్ బళ్లాపూర్లో కూడా మొయిలీకి ఓటమి తప్పదనే అంచనాలున్నాయి. ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. అయితే జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ లు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ పార్టీలు కలిసి పదిహేడు ఎంపీ సీట్లు నెగ్గాలి.

అయితే మొన్నటి వరకూ ఈ ఇరుపార్టీల కార్యకర్తలూ శత్రువులుగా కొట్టుకున్నారు. ఇప్పుడు పొత్తుతో ఒకరికి ఒకరు సహకరించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎక్కడిక్కడ తిరుగుబాట్లు లేచాయి పొత్తు సీట్లలో. దీంతో కర్ణాటకలో బీజేపీ పైచేయి సాధించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. 

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?