నేను డ్రగ్స్ తీసుకోలేదు.. బయటకొచ్చిన కరణ్ జోహార్

సుశాంత్ సింగ్ మరణం నుంచి లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు కరణ్ జోహార్. ఎప్పుడైతే నెపొటిజంపై చర్చ ఎక్కువైందో పూర్తిగా సైలెంట్ అయ్యాడు. ఇక ఈ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న వెంటనే దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా ఇన్నాళ్లూ మీడియాకు దూరంగా ఉంటున్న కరణ్ జోహార్.. తొలిసారి మాదక ద్రవ్యాలపై స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

"గతేడాది జులై 28న నా ఇంట్లో నేను ఇచ్చిన ఓ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు కొన్ని న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండిస్తున్నాను. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. ఆ పార్టీలో ఎలాంటి నార్కోటిక్స్ మేం వాడలేదు. నేను ఎలాంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదు. ఎలాంటి డ్రగ్స్ ఉత్పత్తులకు ప్రచారం చేయడం లేదా ఎండోర్స్ చేయడం లాంటివి చేయలేదు."

ఇలా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు కరణ్ జోహార్. ఎన్సీబీ విచారణలో క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రా అనే ఇద్దరు వ్యక్తులు కీలకంగా మారినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ ఇద్దరూ కరణ్ కు ఆప్తులంటూ మీడియా చేస్తున్న ప్రచారాన్ని సదరు దర్శక-నిర్మాత తిప్పికొట్టాడు. క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ ఎవరో తనకు తెలియదంటున్నాడు.

"అనుభవ్ చోప్రా, ధర్మా ప్రొడక్షన్స్ లో ఉద్యోగి కాదు. 2011-2012 మధ్య కాలంలో కేవలం కేవలం 2 నెలలు మాత్రమే మా సంస్థలో ఆయన పనిచేశాడు. 2013 జనవరిలో ఓ షార్ట్ ఫిలింకు మా సంస్థలో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు. ఇక క్షితిజ్ ప్రసాద్, మా సంస్థలో ఓ ప్రాజెక్టు కోసం గతేడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాడు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అంతకుమించి ఆ ఇద్దరు వ్యక్తులతో.. వాళ్ల వ్యక్తిగత జీవితాలతో నాకు, ధర్మ ప్రొడక్షన్స్ కు ఎలాంటి సంబంధం లేదు."

ఇలా తనవై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు కరణ్ జోహార్. ఇప్పటికే తను ఓసారి దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ మీడియాలో వరుసగా కథనాలు వస్తుండడంతో, మరోసారి వివరణ ఇస్తున్నానని తెలిపిన కరణ్.. ఇకపై కూడా మీడియా తనపై ఇలానే వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తన ప్రకటనలో తెలిపాడు.

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

పవన్ ఇంటర్వ్యూ.. పరస్పర సహకార ఒప్పందం

Show comments