కంగనా పంచ్: ప్రతి ఒక్కరికి ఓ బిరుదు ఇచ్చేసిందిగా

సుశాంత్ సింగ్ మరణం తర్వాత కంగనా ఓ రేంజ్ లో తెరపైకొచ్చింది. ముందుగా నెపొటిజంపై తీవ్ర విమర్శలు చేసింది. ఎప్పుడైతే సుశాంత్ కేసు డ్రగ్స్ మలుపు తీసుకుందో, కంగనా కూడా అదే టర్న్ తీసుకుంది. ఈసారి మరింత మందిని టార్గెట్ చేస్తూ తన మాటలకు మరింత పదునుపెట్టింది. అయితే ఈ క్రమంలో ఆమె కొంతమందికి కొన్ని బిరుదులిచ్చింది.

కొంతమందికి కంగన ఇచ్చిన బిరుదులు ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె తెలిసి చేసిందో, అనుకోకుండా అలా రియాక్ట్ అయిందో తెలియదు కానీ.. కొంతమందికి ఆమె ఇచ్చిన ట్యాగ్ లైన్స్ మాత్రం జనాలకు భలే ఫన్నీగా అనిపిస్తున్నాయి.

ఊర్మిళ - సాఫ్ట్ పోర్న్ స్టార్
ఉదాహరణకు ఒకప్పటి నటి ఊర్మిళనే తీసుకుంటే.. ఆమెను ఉన్నఫలంగా "సాఫ్ట్ పోర్న్ స్టార్" అనేసింది కంగన. ఊర్మిళ తన సినిమాల్లో నటన కంటే.. ఆ సినిమాల్లో చేసిన ఓవర్ డోస్ ఎక్స్ పోజింగ్ తోనే ఎక్కువ పేరు తెచ్చుకుందనేది కంగన అభిప్రాయం.

రియా చక్రబొర్తి - స్మాల్ టైమ్ డ్రగ్గీ
సుశాంత్ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న తర్వాత రియా చక్రబొర్తి అరెస్ట్ అయిన వెంటనే కంగనా లైన్లోకి వచ్చింది. రియాను "స్మాల్ టైమ్ డ్రగ్గీ" గా అభివర్ణించింది. డ్రగ్స్ కేసులో రియా చాలా చిన్న చేప అనే అర్థం వచ్చేలా కంగనా ట్వీట్ చేసింది.

తాప్సి - బి-గ్రేడ్ యాక్టర్
ఇక హీరోయిన్ తాప్సిపై కంగనా వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన తాప్సికి బి-గ్రేడ్ హీరోయిన్ బిరుదు ఇచ్చింది కంగనా. తాప్సితో పాటు స్వరభాస్కర్, రిచా చద్దాలకు కలిపి ఈ బిరుదు ఆపాదించింది.

కరణ్ జోహార్ - మూవీ మాఫియా
ఇక దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కు "మూవీ మాఫియా" అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది కంగనా. నెపోకిడ్స్ ను పరిచయం చేస్తూ.. బాలీవుడ్ లో ఓ మాఫియాను తయారుచేశాడని.. ఇతడికి ఆదిత్య చోప్రా సపోర్ట్ ఇచ్చాడని కంగన ఆరోపణ. వీళ్లిద్దర్ని కలిపి "మూవీ మాఫియా" అనే పదం ఉపయోగించింది.

రణబీర్ సింగ్ - కొకైన్ అడిక్ట్
ఇక బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్ ముగ్గురికి కలిపి మరో బిరుదు ఇచ్చింది కంగనా. వీళ్లను "కొకైన్ అడిక్ట్స్"గా (డ్రగ్స్ బానిసలు) పేర్కొంది. ఎక్కడ పార్టీ జరిగినా వీళ్లు ముగ్గురు హాజరైపోతారని, కొకైన్ అంటే వీళ్లకు యమ ఇష్టమని అంటోంది.

వీళ్లతో పాటు సోనమ్ కపూర్ కు "మాఫియా బింబోస్" (మాఫియాలో దద్దమ్మ) అనే బిరుదును.. దీపిక పదుకోన్ కు "డిప్రెషన్ కా దందా చల్ నే వాలే" (డిప్రెషన్ దందా కొనసాగించే వాళ్లు) అనే ట్యాగ్ లైన్ ను ఇచ్చింది కంగన. ఇలా కంగనా క్రియేట్ చేసిన ట్యాగ్ లైన్స్, బాలీవుడ్ లో బాగానే వైరల్ అవుతున్నాయి.

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

వ్యవస్థను కాపాడాల్సిన కోర్టే ఇలా చేస్తే

Show comments