జనవరి 5న 'సరిలేరు' ఫంక్షన్

సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తోంది. డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. సంక్రాంతి సినిమాలు తమ పని పూర్తి చేసుకోవడానికి చకచకా వర్క్ చేస్తున్నాయి. అలా చేస్తూనే సినిమాకు చేయాల్సిన పబ్లిసిటీ పని కూడా స్టార్ట్ చేసేసాయి. డిసెంబర్ లో అయిదు సోమవారాలు అయిదు పాటలు విడుదల చేయబోతున్నట్లు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ టీమ్ ప్రకటించేసింది.

అంతే కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. ఆ రోజు ఆదివారం, సరిగ్గా సినిమా విడుదలకు వారం రోజులు ముందుగా చేసినట్లు అవుతుంది. అందుకే ఆ డేట్ ను ఫిక్స్ చేసారు.

డిసెంబర్ అంతా పాటలు విడుదల చేసి, జనవరి ఫస్ట్ న ట్రయిలర్ ఇస్తే ఎలా వుంటుందన్న విషయమై చర్చలు సాగుతున్నాయి. సినిమా ఆల్ మోస్ట్ పూర్తి కావస్తోంది. ఒక్క పాటకు మాత్రమే విదేశాలకు వెళ్లే అవకాశం వుంది. మిగిలినవన్నీ ఇక్కడే చిత్రీకరిస్తారు. డిసెంబర్ 20 లోపేవర్క్ అంతా పూర్తయిపోతుందని తెలుస్తోంది.

Show comments