విశాఖకు మహర్దశ కల్పించిన జగన్

విశాఖ మీద ప్రతీ సారీ తన అభిమానాన్ని ముఖ్యమంత్రి జగన్ చాటుకుంటూ వస్తున్నారు. విశాఖ సమస్యల మెద ఆయన ప్రత్యేక దృష్టి సారించి వాటి సత్వర పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే విశాఖలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన కేజీహెచ్ కి నిధుల లేమి చాలా కాలంగా పట్టి పీడిస్తోంది. ఉత్తరాంధ్రాతో పాటు ఇటు ఒడిషా నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు ఈ ఆసుపత్రికి వస్తారు.

అటువంటి ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి గతంలో ఏ సీఎం చేయని విధంగా నిధుల వరదను జగన్ పారించారు ఏకంగా ఆరు వందల కోట్లు కేజీహెచ్ కి నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధికి బాటలు వేశారు. అదే విధంగా  విశాఖలోని మరో ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్ కి 250 కోట్లు,  ఘోషా ఆసుపత్రికి 100 కోత్లు కేటాయించడం ద్వారా మెగా సిటీలో ప్రభుత్వ వైద్య సేవలకు ఊతమిచ్చారు.

అంతే కాదు రూరల్ జిల్లా అనకాపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అయిదు వందల కోట్లను సీఎం మంజూరు చేశారు. మొత్తానికి జగన్ వైద్య రంగం మీద చూపిస్తున్న శ్రద్ధతో విశాఖలో పేదలకు న్యాయం జరుగుతుంది అన్నది అక్షర సత్యం.

Show comments