జగన్ : భవిష్యత్ దార్శనికతతో అడుగులు!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశాలకు దేశాలే షట్ డౌన్ అయిపోతున్నాయి. ప్రజాజీవితం ఇళ్లకే పరిమితమవుతోంది. ఇంట్లోంచి అడుగు బయటపెట్టాలంటే మానవాళి భయపడిపోతోంది. ప్రభుత్వాలన్నీ ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని రక్షించడానికి, వారి క్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి వాటితో ఒకింత కఠినంగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం భవిష్యత్ దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సమగ్ర సర్వే చేపట్టాలని జగన్ సర్కారు నిర్ణయించింది. గురువారం లోగా ఈ సర్వే పూర్తి చేయాలని.. ప్రతి ఇంటిలోని ప్రతి పౌరుడి ఆరోగ్యాలను గురించిన సమగ్ర వివరాలను ఈ సర్వే ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కరోనా పడగ విప్పి ప్రపంచాన్ని భయపెడుతోంది. కేవలం ఈ ఒక్క విపత్తును సమర్థంగా ఎదుర్కోవడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో కూడా.. ఎలాంటి ఆరోగ్య సంక్షోభం వచ్చినా సరే.. దానిని సమర్థంగా అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, సర్వే వంటి ప్రయత్నాలు ఉపయోగపడతాయనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.

జగన్ సర్కారు.. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రం షట్ డౌన్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రధానంగా నిరుపేదలను ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తరహాలోనే వారికి ప్రత్యేక సాయం అందిస్తోంది. కర్ఫ్యూ తరహా వాతావరణం తీసుకురావడం ద్వారా సోషల్ డిస్టెన్సింగ్ ను పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి చైతన్యం తీసుకురావడానికి వివిధ వర్గాల సాయం తీసుకుంటున్నారు.

ఆరోగ్యంపై పనిచేసే స్వచ్ఛంద సంస్థల సేవలను వాడుకుంటున్నారు. రిటైర్డు ఉద్యోగులు, ఇతరుల సేవలను కూడా వాడుకోవడానికి చూస్తున్నారు. ఆకతాయిలు రోడ్ల మీదకి వచ్చి నిబంధనలు ఉల్లంఘించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగాను కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటితో పాటు ఆరోగ్య సమగ్ర సర్వే అనేది ముందు ముందు ఏ విపత్తు వచ్చినా కూడా తక్షణ సాయం ప్రజలకు అందించడానికి భేషైన మార్గమనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్

Show comments