కోట్ల కుటుంబానికి జగన్ రాజకీయ భిక్ష

చంద్రబాబు కొన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటారు, మరికొన్ని అవతలి వాళ్లను దెబ్బకొట్టాలని హడావుడిలో నిర్ణయిస్తారు. కోట్ల టీడీపీ ప్రవేశం కూడా ఇలాంటిదే. వాస్తవానికి కాంగ్రెస్ నాయకులుగా కోట్ల కుటుంబీకులు కర్నూలు జిల్లాపై పట్టు కోల్పోయారు. పార్టీ మారకుండా ఉన్నందుకు తమ రాజకీయ భవష్యత్ ను పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్రంలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఉంటే.. ఉమ్మడి అభ్యర్థిగా కర్నూలు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని అనుకున్నారు సూర్యప్రకాష్ రెడ్డి. అది వర్కవుట్ కాకపోవడంతో కోట్ల వర్గం టీడీపీలో చేరేందుకు సిద్ధమైంది. అయితే సీట్ల విషయంలో తకరారు మొదలైంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు లోక్ సభ సీటు, ఆయన భార్య సుజాతమ్మకు డోన్ లేదా ఆలూరు సీటు, కొడుకు రాఘవేంద్ర రెడ్డికి ఎమ్మెల్సీ .. ఇదీ కోట్ల కుటుంబం అడిగిన ఫ్యామిలీ ప్యాకేజీ.

అయితే చంద్రబాబు మాత్రం ససేమిరా అనడంతో ఇన్నాళ్లూ ఈ చేరికపై సందిగ్ధం ఏర్పడింది. అయితే వైఎస్ జగన్ పరోక్షంగా కోట్ల నెత్తిన పాలు పోశారు. రాష్ట్రంలో వైసీపీలో చేరికలు జోరందుకోవడంతో టీడీపీలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు లోటస్ పాండ్ కు క్యూ కట్టడంతో చంద్రబాబు హడలి పోతున్నారు. ఈ భయాన్ని కప్పిపుచ్చుకోడానికే టీడీపీలోకి కూడా నాయకులను ఆహ్వానిస్తున్నారు. వారి గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇలా జాక్ పాట్ కొట్టింది కోట్ల కుటుంబం. జగన్ భయంతోనే కోట్ల ఫ్యామిలీని చంద్రబాబు హడావుడిగా టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇన్నాళ్లూ అటకపై పెట్టిన చేరికకు మహూర్తం పెట్టారు. ఈనెల 28న కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ బహిరంగ సభ పెట్టి మరీ కోట్లకు పచ్చ కండువా కప్పబోతున్నారు చంద్రబాబు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని స్థానిక నాయకులకు ఆదేశాలు వెళ్లాయి.

అంతా బాగానే ఉంది కానీ, కోట్ల చేరికతో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. డోన్ నియోజకవర్గంపై అటు కోట్ల, ఇటు కేఈ వర్గం పట్టుబడుతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు డోన్ ని కోట్ల ఫ్యామిలీకి కేటాయిస్తామని మాటిచ్చేసి, కేఈని బుజ్జగిస్తున్నారు.

కోట్ల చేరికతో టీడీపీకి ఎంతవరకు లాభముంటుందో తెలియదు కానీ, వైసీపీలో చేరికలకు పోటీగా తమ పార్టీలోకి కూడా నేతలు వలస వస్తున్నారని చెప్పుకోడానికి చంద్రబాబుకి ఓ అవకాశం దొరికింది. కేవలం చేరికలను ప్రోత్సహించేందుకే చంద్రబాబు కోట్ల ఫ్యామిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నమ్మిన బంటులా ఉన్న కేఈని పక్కన పెట్టేందుకు సైతం చంద్రబాబు సాహసించారు.

రాయలసీమ రైతుల పుండుపై కారం