విశాఖపై జగన్ ఫుల్ ఫోకస్?

విశాఖ మొత్తానికి వైసీపీని వరించింది. ఏడేళ్ల క్రితం ఎంపీ ఎన్నికల్లో భారీ  ఓటమి. రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో కూడా సిటీలో నాలుగు చోట్ల పరాజయం. ఇలా విశాఖ అందని పండు అవుతున్న వేళ గురి చూసి మరీ వైసీపీ ఏకంగా మేయర్ సీటు పట్టేసింది.

ఏపీలో అతి పెద్దదైన కార్పోరేషన్ ఇపుడు వైసీపీ చేతుల్లోకి వచ్చింది. విశాఖ నగర  పాలన అంతా కూడా మొత్తం వైసీపీ చూడాల్సి  గురుతర బాధ్యతను జనం పెట్టారు. దీంతో  వైసీపీ తరఫున  విశాఖ మేయర్ ఎవరు అవుతారు అన్నది ఆసక్తికరమైన చర్చ.

అయితే ఎవరు మేయర్ అయినా విశాఖ డెవలప్మెంట్ బాధ్యతను మొత్తం వైసీపీ హై కమాండ్ తీసుకుంటుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్ విశాఖ మీద ఇక మీదట ఫుల్ ఫోకస్ పెడతారు అంటున్నారు. 

పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న దాని మీద ముఖ్యమంత్రి మదిలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని అంటున్నారు.

ఇక ఓటేసిన జనం కూడా జగన్ మీద నమ్మకంతోనే మేయర్ పీఠం అప్పగించారు అన్నది తెలిసిందే.  మొత్తానికి ముఖ్యమంత్రి  జగన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో విశాఖ ప్రగతి రధం ముందుకు సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

బాబుకు సిగ్గుంటే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టొద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం

Show comments