తప్పుల మీద తప్పులు చేశారు.. బాబుపై జగన్ ఫైర్

చేజేతులా 29 మంది మరణానికి కారణమైంది చంద్రబాబు కాదా..?
లక్షల్లో భక్తులు వస్తారని తెలిసి గేట్లు కావాలనే మూసివేసింది బాబు కాదా..?

తన ప్రచారం కోసం, గొప్పలు చెప్పుకోవడం కోసం, గోదావరి పుష్కరాలపై డాక్యుమెంటరీ తీసి తనను తాను హీరోగా చూపించుకోవడం కోసం 29 మంది ప్రాణాల్ని బలితీసుకున్నది చంద్రబాబు కాదా.. ? ముమ్మాటికీ ఈ మరణాలకు కారణం చంద్రబాబే. ఏ తెలుగువాడ్ని అడిగినా ఈ విషయం చెబుతాడు. కానీ సోమయాజులు కమిషన్ కు మాత్రం ఈ పచ్చినిజం కనిపించలేదు. 

పుష్కర తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదంటూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదిక, వైఎస్ఆర్సీ అధినేత జగన్ కు ఆగ్రహం తెప్పించింది. అధికారులు, మీడియాను ఇప్పటికే తనకు అనుకూలంగా మార్చుకొని అరాచకం సాగిస్తున్న చంద్రబాబు, ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమిషన్లను కూడా తన స్వార్థానికి అనుకూలంగా వాడుకోవడంపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

"పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పయితే, దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవాలనుకోవడం మరో తప్పు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పు మీద తప్పు చేశారు."

ఇలా తప్పుల మీద తప్పులు చేసి 29 మంది అమాయకుల మరణానికి చంద్రబాబు ప్రత్యక్షంగా కారణమయ్యారని జగన్ ఆరోపించారు. తప్పుడు రిపోర్టులు ఇప్పించుకొని భగవంతుడు, ప్రజల దృష్టిలో చంద్రబాబు మరింత చులకన అయ్యారని విమర్శించారు. 

"చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల 29 మంది చనిపోతే, క్షమించమని దేవుడ్ని, ప్రజలను అడగాల్సింది పోయి, తన చేతిలో ఉన్న కమిషన్ చేత తప్పుడు రిపోర్టులు ఇప్పించుకున్నారు. భగవంతుడు, ప్రజల దృష్టిలో మరింత చులకన అయ్యారు."

చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజు అతి దగ్గరలో ఉందన్నారు జగన్. తన స్వార్థం, పార్టీ ప్రముఖల కోసం ప్రజల ప్రాణాల్ని తాకట్టు పెడుతున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు జగన్. 

Show comments