బాయ్ ఫ్రెండ్ తో హీరో కూతురు, రొమాంటిక్ గా!

ఉత్తరాది యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ కు. అప్పుడప్పుడు మీడియాకు కనిపించే ఈమెపై కెమెరాలు క్లిక్ మంటూ ఉంటాయి. అలా ఫాలోయింగ్ సంపాదించుకుని ఇన్ స్టాగ్రమ్ లో బోలెడంతమంది ఫాలోయర్లను కలిగి ఉంది ఇరా. అక్కడే ఈ భామ తన డేటింగ్ కథను కూడా వెల్లడించింది.

తను ఒక అబ్బాయితో డేటింగ్ లో ఉన్నట్టుగా ఇరాఖాన్ ఇదివరకే ప్రకటించింది. అతడి పేరు మిషాల్ కృపాలని. అతడితో తన రొమాంటిక్ మొమెంట్స్ ను తరచూ ఫాలోయర్లకు అందిస్తూ ఉంటుంది ఇరా. అతడితో సరదాగా చేసిన డ్యాన్సులను, డిన్నర్ డేట్స్ ను ఫొటోలుగా వీడియోలుగా ఫాలోయర్లకు అందిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా మరో పిక్ ను పోస్టుచేసింది ఇరాఖాన్. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ పోజును ఇచ్చింది. 'Everything will be okay..' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ మాటతో తను ఏం చెప్పదలుచుకుందో కానీ.. ఇరా ఫ్యాన్స్ తమ కామెంట్లతో రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు.

ముడుపులకు ఆశపడితే మూడినట్టే!

Show comments