కుర్రహీరోను వెంటాడుతున్న ఫ్లాపులు

మూడేళ్ల నుంచి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు సందీప్ కిషన్ కి. ఎన్నో ఆశలతో 2018లోకి అడుగుపెట్టిన ఈ కుర్రహీరోకు, ఈ ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ ఏడాది ఇప్పటికే "మనసుకు నచ్చింది" అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న సందీప్, తాజాగా 'నెక్ట్స్ ఏంటి' మూవీతో మరో అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్నాడు.

నిజానికి మనసుకు నచ్చింది సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాడు సందీప్ కిషన్. కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకొని మళ్లీ తెరపైకి రావాలనుకున్నాడు. అయితే మేనల్లుడి కోసం ఛోటా కె నాయుడు ఎంతో కష్టపడి నెక్ట్స్ ఏంటి ప్రాజెక్టు సెట్ చేశాడు. కునాల్ కోహ్లీ డైరక్షన్ కావడం, తమన్నా హీరోయిన్ గా నటించడంతో ఈ ప్రాజెక్టుపై సందీప్ కిషన్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు.

కానీ నెక్ట్స్ ఏంటి సినిమా కూడా సందీప్ కు దెబ్బకొట్టింది. దీంతో అతడి కెరీర్ మరోసారి నెక్ట్స్ ఏంటి అనే విధంగా తయారైంది. ఈ సినిమాతో ఈ ఏడాదిని కూడా ఫ్లాప్ ఇయర్ గా ముగించబోతున్నాడు ఈ హీరో. అయినా ఈ హీరోకు ఫ్లాపులు కొత్త కాదు కదా.

2016లో రన్, ఒక్క అమ్మాయి తప్ప సినిమాలు చేశాడు. ఆ రెండూ ఫ్లాపులే. ఇక 2017లో నగరం, శమంతకమణి, నక్షత్రం, కేరాఫ్ సూర్య, ప్రాజెక్టు-జెడ్ సినిమాలు చేశాడు. వీటిలో శమంతకమణి ఓ మోస్తరుగా ఆడినా అది సందీప్ సోలో హిట్ కిందకు రాదు. మిగతావన్నీ ఫ్లాపులే. ఇక ఈ ఏడాదిని మనసుకు నచ్చింది, నెక్ట్స్ ఏంటి లాంటి ఫ్లాపులతో ముగిస్తున్నాడు సందీప్.

Show comments