'రొమాంటిక్' సెట్స్ లో అగ్నిప్రమాదం

పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమా సెట్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సాంగ్ షూట్ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో, ప్రమాదవశాత్తూ కర్టెన్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. తేరుకున్న యూనిట్ సభ్యులు వెంటనే మంటల్ని ఆర్పే ప్రయత్నం తెచ్చారు.

సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఖరీదైన సోఫా సెట్లు, ఇతర డేకరేషన్ సామగ్రిని వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. అయితే అగ్నిప్రమాదం సంభవించినప్పుడు యూనిట్ స్పందించిన తీరు మాత్రం విమర్శల పాలైంది. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే విషయం తెలుస్తూనే ఉంది. మంటల్ని ఆర్పే పరికరాలు అందుబాటులో లేవు. కేవలం మంచి నీటి బాటిళ్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.

మంటలు చిన్నవి కాబట్టి వెంటనే అదుపులోకి వచ్చాయి. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. షూటింగ్ మాత్రం వాయిదాపడింది. ఈ సినిమాతో అనీల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించడమే కాకుండా.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. 

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments