ఫిబ్రవరి14న మహనాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం మహా నాయకుడు ఈ సినిమాను జనవరి 25న విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. జనవరి 9న కథానాయకుడు అనే అనే మొదటిభాగం, అదే నెల 25న మహా నాయకుడు అనే రెండోభాగం విడుదల చేస్తామని ప్రకటించారు.

సినిమా రెండు భాగాలు కేవలం రెండువారాల తేడాతో ఒకేనెలలో విడుదల చేయడంపై అప్పట్లోనే ఇండస్ట్రీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. అయితే దీనిమీద నిర్మాతలకు దర్శకుడు క్రిష్ కు మధ్య ఒక పట్టాన ఏకాభిప్రాయం కుదరలేదు.

అయితే బాలయ్య ఫైనల్ నిర్ణయాన్ని దర్శకుడుకే వదిలేశారు దాంతో దర్శకుడు క్రిష్ బాధ్యత తనది అనిచెప్పి జనవరి 25న రెండోభాగం విడుదల డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు నిర్ణయం మళ్లీ మారింది రెండోభాగం విడుదల ఫిబ్రవరి 14కి వెళ్ళింది.

ఈ విషయం బయటకు ప్రకటించుకున్న బయ్యర్లకు మాత్రం తెలియజేసినట్లు భోగట్టా. మొదటి భాగాన్ని భారీ రేట్లకు విక్రయిస్తున్నందున రెండువారాల గ్యాప్లో రెండోభాగం విడుదల చేస్తే గిట్టుబాటు కాదని బయ్యర్లు గోల పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

దీంతో ఇప్పుడు జనవరి 25 డేటుకు సినిమాలు రెడీ అయిపోతున్నాయి. కళ్యాణ్ రామ్ నటించిన గుహన్ డైరెక్షన్ లోని సినిమా అలాగే కార్తీ నటించిన దేవి సినిమా జనవరి 25కి రావాలని ఫిక్స్ అయ్యాయి.

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments