'స్పైడర్' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో వున్నా కానీ మురుగదాస్, మహేష్ అండ్ కో అందుకు తగ్గ సినిమాని అందించలేకపోయారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వున్న యాక్షన్ థ్రిల్లర్ అంటూ ప్రచారం చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఒక సైకో కిల్లర్ వర్సెస్ స్పై సినిమాగా తయారైంది. మహేష్‌ని ప్యాసివ్‌గా చూపించి విలన్ని హైలైట్ చేయడం మిస్‌ఫైర్ అయిందని సమీక్షలు వస్తున్నాయి.
టాక్ వీక్‌గా వుండడంతో ఈ చిత్రం పండగ సెలవుల తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇక గత వారం విడుదలైన 'జై లవకుశ' అయితే నాలుగు రోజుల ముచ్చట అయింది. వీకెండ్లో వసూళ్ల పంట పండించుకున్న ఈ చిత్రం కలక్షన్లు ఆ తర్వాత గణనీయంగా పడిపోయాయి. స్పైడర్ వీక్ అవడంతో సెకండ్ వీకెండ్‌పై, హాలిడే కలక్షన్లపై బయ్యర్లకి ఆశలు చిగురించాయి.
ఈ రెండిటితో పాటు విడుదలైన మహానుభావుడు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోగలిగింది. మొదటి రోజు వసూళ్లు బాగా సాధించిన ఈ చిత్రం టాక్ బాగుంటే కనుక స్పైడర్, జై లవకుశ చిత్రాల హాలిడే కలక్షన్లని ఎఫెక్ట్ చేసే అవకాశముంది.