దిల్ రాజుకు షాక్

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు ఓ స్టామినా వుంది. పేరు వుంది. ఆయన టేకప్ చేసారు అంటే ఏదో వుంటుంది అన్న భరోసా వుంది. ఆయన విడుదల చేసారు, ఆయన బ్యానర్ యాడ్ చేసారు అంటే దానికి మినిమమ్ వుంటుంది అన్న అంచనాలు వున్నాయి.

అయినా అప్పడప్పుడు షాక్ లు తగులుతుంటాయి. ఈవారం అలాంటి షాక్ నే షాదీ ముబారక్ ఇచ్చింది. మూడేళ్లు కష్టపడి చిన్న తెర నటుడు సాగర్ నిర్మించుకున్న సినిమా ఇది. విడుదల కోసం దిల్ రాజు దగ్గరకు వచ్చింది.

ఆయన కొన్ని రీ షూట్ లు చేయించి, కొన్ని ప్యాచ్ వర్కులు చేయించి, తన బ్యానర్ యాడ్ చేసి, తన పేరు జోడించి విడుదల చేసారు. ఇంత చేసిన ఆయన సినిమాకు సరైన ప్రచారం సాగించడంలో, సరైన లాంచింగ్ ఇవ్వడంలో స్వంత సినిమాలకు చేసిన రేంజ్ పబ్లిసిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు, ఏదో విడుదల చేసాం అంటే చేసాం అన్నట్లు చేయడంతో సినిమాకు మినిమమ్ ఓపెనింగ్స్ రాలేదు. 

నిజానికి సినిమా తొలిసగం ఓకె. మరి సగం ఓ మాదిరిగా వుందనే టాక్ వచ్చింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ పడి వుంటే ఈ టాక్ మౌత్ టాక్ తో స్ర్పెడ్ అయి వుండేది. కలెక్షన్లు ఇంప్రూవ్ అయి వుండేవి. కానీ మరీ అతి తక్కువ కలెక్షన్లు రావడంతో చాలా ఏరియాల్లో తొలి రోజే సినిమాను తీసేయాల్సి వచ్చింది. ఇదే కనుక సినిమాకు కాస్త గట్టిగా పబ్లిసిటీ చేసి వుంటే ఫలితం వేరేగా వుండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

Show comments