వాళ్ళు వద్దంటే ఉచిత పధకాలు ఆపేస్తాం

ఈ రోజు ఏపీ బోలెడు అప్పుల్లో మునిగిపోయిందని తెల్లారిలేస్తే టీడీపీ, జనసేన తెగ గగ్గోలు పెడుతూ ఉంటాయి. ఏపీని తీసుకెళ్ళి శ్రీలంకతో భలే పోలిక కూడా పెడుతూ ఉంటాయి. అయితే ఏపీకి ఇన్ని అప్పులు రావడానికి అలా జరగడానికి అయిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం అన్న సంగతికి కూడా చాలా కన్వీనియెంట్ గా టీడీపీ జనసేన మరచిపోతాయి.

ఇపుడే తాము పుట్టినట్లుగా అన్నీ కళ్ళు తెరచి ఈ రోజే చూస్తున్నట్లుగా ఆరోపణలు సంధిస్తున్నాయి. ఉచిత పధకాల మీద ఇండైరెక్ట్ గా గగ్గోలు పెడుతున్న ఈ రెండు పార్టీలు కూడా నిజంగా అప్పుల కుప్ప ఏపీ కాకూడదు అనుకుంటే సంక్షేమం మీద తన స్టాండ్ ఏంటో చెప్పగలవా. ముందుగా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబునే తీసుకుంటే 2024 ఎన్నికలకు ఆయన ఉచితాలు లేని మ్యానిఫేస్టోని తీసుకురాగలరా.

అంతవరకూ ఎందుకు. ఉచిత పధకాలు వేస్ట్ అని టీడీపీ వారు కానీ పవన్ కానీ ఒకే ఒక్క మాట అంటే చాలు కదా. వైసీపీ సర్కార్ కి ఈ పార్టీల అజెండా ఏంటో అర్ధమవుతుంది కదా. కానీ ఉచిత పధకాల మీద పరోక్షంగా మాట్లాడుతూ బయటకు మాత్రం అప్పులు అంటూ గోడు పెడుతూంటారు. అందుకే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు.

ఉచితాల మీద మీ విధానం ఏంటో ముందు జనాలకు చెప్పి ఆ మీదట అనాల్సినవి అన్నీ అనండి అంటూ టీడీపీ జనసేనలకు సూచించారు. అంతే కాదు ఆయన మరో మాట కూడా అన్నారు. ఉచిత పధకాలు వద్దు అని జనాల చేత మాట అనిపించండి. ఒక్క క్షణంలోనే మేము పధకాలను రద్దు చేసి పారేస్తామని. నిజంగా ఇంతటి ఆఫర్ ఇచ్చాక జనాలను ముందు పెట్టుకుని ఉచితాలు వద్దు అని పవన్ కానీ బాబు కానీ అనిపించగలరా. 

Show comments