దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు-పవన్

గోదావరి జిల్లాలో కవాతు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై మాటల తూటాలు విసిరారు. దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, జనసేన సత్తా చూపిస్తుందని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే, మాజీ సర్పంచ్ లు అందరితో కలిసి ఉద్యమం నిర్వహిస్తా అని ఆయన హెచ్చరించారు.

కోర్టు చేత ఈ విషయంలో మొట్టికాయలు తినవద్దని పవన్ అన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల లక్షల కోట్ల రూపాయల కేంద్ర నిధులు వెనక్కు పోతున్నాయని ఆయన అన్నారు. సిఎమ్ చంద్రబాబు, ఆయన కుమారుడు పంచాయతీ మంత్రి లోకేష్ కలిసి, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పవన్ విమర్శించారు.

పంచాయతీ లెవెల్ లో కూడా పోటీచేయలేని లోకేష్ ను ఏకంగా మంత్రిని చేసారని పవన్ దుయ్యబట్టారు. విజన్ 2020 ఫలితం ఇవ్వలేదని, చంద్రన్న పథకాలు అన్నీ ప్రచారం కోసం తప్ప మరేమీకాదని తాను ఎక్కడికి వెళ్లినా జనం చెబుతున్నారని పవన్ వివరించారు.

రకరకాలుగా స్పీచ్
పవన్ స్పీచ్ రకరకాలుగా సాగింది. స్పీచ్ లో అధిగభాగం చంద్రబాబు ఫ్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి వాడారు. ఓ అయిదు నుంచి పదిశాతం జగన్ పై బాణాలు ఎక్కుబెట్టారు. మిగిలిన శాతం అంతా జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పుకున్నారు. మధ్యమధ్యలో పార్టీకి చెందిన వ్యక్తుల గురించి ప్రస్తావించారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments