చరణ్, ఎన్టీఆర్ బిజీ.. తెరపైకి బన్నీ

ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా ఓ మూవీ చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా ఉంది. ఈ మూవీ కూడా ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ రాజమౌళి వల్ల కొరటాల ప్లానింగ్ మొత్తం మారిపోయింది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి మల్టీస్టారర్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ రానప్పటికీ.. దాదాపు ఇది ఫిక్స్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో మహేష్ మూవీ తర్వాత కొరటాల ఫ్రీ అయిపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే సీన్ లోకి ఎంటరయ్యాడు బన్నీ. 

అవును.. కొరటాల దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయి. ప్రాజెక్టు కనుక ఫైనలైజ్ అయితే దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది. 

కొరటాలతో సినిమా ఓకే అయితే అటు విక్రమ్ కుమార్, లింగుస్వామికి బన్నీ మరోసారి హ్యాండ్ ఇచ్చినట్టవుతుంది. బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీ అయిందని, సమ్మర్ నుంచి షూటింగ్ ఉంటుందని లింగుస్వామి ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొరటాలతో సినిమా ఓకే అయితే, బన్నీ కోలీవుడ్ డెబ్యూ ఇంకాస్త ఆలస్యం కావొచ్చు.

Show comments