బన్నీ సరసన నివేథా పేతురాజ్

చిత్రలహరిలో నటించిన నివేధా పేతురాజ్ లక్కీ చాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడి డైరక్షన్ లో, బన్నీ లాంటి హీరో సరసన నటించే చాన్స్ వచ్చింది అంటే లక్కీనే కదా? త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడూ వుంటుంది. అలాగే లేటెస్ట్ సినిమాలో కూడా వుంది.

ఈ క్యారెక్టర్ కోసం చాలా పేర్లు వినిపించాయి. కానీ ఆఖరికి నివేథా పేతురాజ్ పేరు ఫైనల్ అయింది. ఫైనల్ కావడమే కాదు, ఈరోజు షూటింగ్ సెట్ కూడా కూడా వచ్చింది. నివేథా పేతురాజ్ తొలిసారిగా చిత్రలహరి సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించింది. ఇది రెండో సినిమా.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని నిర్మించే సినిమా సెకెండ్ షెడ్యూలు ప్రారంభమైంది. దాదాపు నెలరోజుల లెంగ్తీ షెడ్యూలు ఇది. హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.

పరిటాల శ్రీరామ్..చలో సింగపూర్ అంటారా?

Show comments